కుమారుడితో అన్యోన్యంగా లేదని కోడలిని నరికి చంపిన మామ
బెంగళూరు: తన కుమారుడు సంపాదిస్తున్నా నీవు ఎందుకు అతనిని సక్రమంగా చూడటం లేదని ఆగ్రహిస్తూ కోడలిని మామ వేటకోడవలితో నరికి హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. చిత్రదుర్గ జిల్లా హొళల్కేర తాలుకా మల్లాడిహళ్ళి గ్రామంలో రిటైడ్ టీచర్ క్రిష్ణమూర్తి నివాసం ఉంటున్నారు. ఈయన కుమారుడు రాజేష్ ఇంజనీరు. రాయచూరు జిల్లా లింగసనూరుకు చెందిన దివ్య (26), రాజేష్ ల వివాహం జరిగింది. రాజేష్ భార్యతో కలిసి బెంగళూరు చేరుకుని నివాసం ఉంటూ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
15 రోజుల క్రితం రాజేష్ భార్యతో కలిసి మల్లాడిహళ్ళిలోని ఇంటికి వెళ్లాడు. అప్పటి నుండి రాజేష్ తండ్రి మీరు వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. నాకుమారుడితో నీవు అన్యోన్యంగా లేవని, సరిగా మాట్లాడటం లేదని, అతనికి బోజనం పెట్టడం లేదని క్రిష్ణమూర్తి కోడలు దివ్యాను ప్రశ్నించాడు.

ఆ సందర్బంలో కుమారుడు రాజేష్, కుటుంబ సభ్యులు క్రిష్ణమూర్తికి సర్ధిచెప్పారు. అప్పటి నుండి మామ, కోడలు పోట్లాడుకుంటున్నారు. మంగళవారం ఇద్దరి మద్య గొడవ జరిగింది. కుటుంబ సభ్యులు సర్ధి చెప్పడంతో దివ్యా లోపలికి వెళ్లిపోయింది. బుధవారం బెంగళూరు వెళ్లిపోవాలని దివ్యా భర్తకు చెప్పింది. రాత్రి బట్టలు సర్ధుకునింది. తరువాత ఎవరిపాటికి వారు వారి గదులలో నిద్రపోయారు. బుధవారం వేకువ జామున వేట కోడవలి తీసుకున్న క్రిష్ణమూర్తి గాడనిద్రలో ఉన్న కోడలు దివ్యా మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.
తీవ్రగాయాలు కావడంతో దివ్య పడకగదిలోనే ప్రాణాలు వదిలింది. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న హొళల్కేర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. కోడలిని హత్య చేసి ఇంటి దగ్గరే దర్జాగా కుర్చుని ఉన్న క్రిష్ణమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications