Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ సీఎం, బళ్లారి బ్రదర్ కు టిక్కెట్లు ఇచ్చింది నేనే, మోదీ పార్టీలో కలకలం రేపిన సిద్దప్ప!

బెంగళూరు/బళ్లారి: కర్ణాటకలోని విజ‌య‌నన‌ర జిల్లా హ‌గ‌రిబొమ్మ‌న‌హ‌ళ్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ టిక్కెట్ ఇప్పిస్తాన‌ని మోసం చేసిన కేసులో కొత్త ట్విస్ట్ తో అందరూ హడలిపోయారు. నిందితుడు రేవణ సిద్దప్ప తాను బీజేపీలో ప్రముఖుడని, మాజీ ముఖ్యమంత్రికి తానే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించానని మోసం చేశారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ఈ కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, కర్ణాటక మంత్రి బళ్లారి శ్రీరాములు పేరును కూడా నిందితుడు ప్రస్తావించాడని వెలుగు చూడటం ఇప్పుడు కర్ణాటకటలో కలకలం రేపింది. ఉడిపికి చెందిన వ్యాపారవేత్త గోవింద బాబు పూజారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ టిక్కెట్ ఇప్పిస్తామని రూ 5 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని వెలుగు చూడటం బీజేపీ వర్గాల్లో కలకలం రేపింది.

Revana Siddappa is cheating by giving MLA tickets to ex-CM Bommai and ex-minister

ఇప్పటికే ఈ కేసులో కుందాపురకు చెందిన హిందూ సంఘం నాయకురాలు చైత్రా కుందాపుర, హడగలి తాలూకాలోని హిరేహడగలికి చెందిన హాలస్వామి మఠానికి చెందిన అభినవ హాలశ్రీ స్వామిజీ తదితరులను అరెస్టు చేశారు. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఇప్పుడు కర్ణాటకలోని విజయనగరం జిల్లా హగరిబొమ్మనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ టికెట్‌ కోసం డబ్బులు ఇచ్చి మోసం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Revana Siddappa is cheating by giving MLA tickets to ex-CM Bommai and ex-minister

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ టిక్కెట్లు ఇప్పిస్తానంటూ మోసం చేసిన నిందితుడు రేవణ సిద్దప్ప గతంలో చాలా మంది ప్రముఖులకు బీజేపీ టిక్కెట్లు ఇప్పించానని ప్రచారం చేసుకున్నాడని వెలుగు చూసింది. ఈ మోసగాడు రేవణ సిద్దప్ప మాటలు వింటే డబ్బు ఇవ్వాలన్నంత నమ్మకం కలుగుతుంది. కర్ణాటకలో 2013, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములుకు బీజేపీ టికెట్ లు తానే ఇప్పించానని రేవణ సిద్దప్ప చాలా మందిని నమ్మించాడని వెలుగు చూసింది.

Revana Siddappa is cheating by giving MLA tickets to ex-CM Bommai and ex-minister

ఇతని మాటలు నమ్మిన రిటైర్డ్ ఇంజినీర్ శివమూర్తి కూడా కోట్ల రూపాయలు చెల్లించి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించాలని రేవణ సిద్దప్పకు మనవి చేశారని వెలుగు చూసింది.హగరిబొమ్మనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ టికెట్‌ కోసం ప్రయత్నించిన శివమూర్తి మోసపోయాడని వెలుగు చూసింది. ఈ దెబ్బతో బీజేపీకి చెందిన అనేక మంది నాయకుల మైండ్ బ్లాక్ అయ్యింది.

Revana Siddappa is cheating by giving MLA tickets to ex-CM Bommai and ex-minister

ఈ మోసం గురించి శివమూర్తి మంగళవారం మాట్లాడుతూ బళ్లారి శ్రీరాములు సొంత పార్టీ పెట్టిన తరువాత మళ్లీ బీజేపీలోకి వచ్చినప్పుడు నేనే ఆయనకు టిక్కెట్ ఇప్పించానని, గతంలో మాజీ సీఎం బసవరాజ్‌ బోమ్మయ్ కి తానే ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానని, . శ్రీరాములు ఎదుగుదలకు తానే ఎక్కువ కష్టపడ్డానని రేవణ సిద్దప్పను అనేక మందిని నమ్మించాడని, తాను ఇలాగే మోసపోయానని రిటైడ్ ఇంజనీర్ శివమూర్తి లబోదిబో అంటున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని పెద్ద వాళ్లందరికీ బీజేపీ టిక్కెట్టు ఇప్పించానని రేవణ సిద్దప్ప చెప్పిన తరువాత తాను నమ్మాల్సి వచ్చిందని శివమూర్తి అన్నారు. బీజేపీ టిక్కెట్‌ ఇస్తానని చెప్పి మోసం చేశారు. నేను డబ్బు చెల్లించాను, తనకు బీజేపీ టిక్కెట్ రాకపోవడంతో నేను ఇచ్చిన డబ్బు తిరిగి అడిగానని, అప్పుడు తనను చంపేస్తామని రేవణ సిద్దప్ప బెదిరించాడని రిటైడ్ ఇంజనీరు శివమూర్తి ఆరోపించారు.

అయినా తాను ఎవ్వరికి భయపడకుండా డబ్బులు ఇవ్వాలని అతని మీద ఒత్తిడి పెంచినప్పుడు చెక్కులు కూడా ఇచ్చాడని, ఆ చెక్కులు అన్ని బ్యాంకుల్లో బౌన్స్ అయ్యాయని శివమూర్తి మీడియాకు చెప్పారు. అయితే ఈ విషయంలో బీజేపీ నాయకులు రేవణ సిద్దప్ప గురించి పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+