Revenge: గ్రామస్తుల దాడిలో దళిత యువకుల మృతి, దెబ్బకు ఊరులో మగాళ్లు మాయం, ఏం జరిగింది ?!

బెంగళూరు/తుమకూరు: అర్దరాత్రి అనుమానాస్పదంగా కొందరు తిరుగుతున్నారని గ్రామస్తులకు తెలిసింది. ఇదే సమయంలో గ్రామస్తులు రాత్రిపూట గస్తీ తిరగడం మొదలుపెట్టారు. అర్దరాత్రి పోలం సమీపంలోని పంప్ సెట్లు విప్పి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్న గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాదేశారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గుబ్బి సమీపంలో పెద్దహళ్ళి గ్రామస్తులు కొట్టిన దెబ్బకు గిరీష్ (24), గిరీష్ బాబు (27) అనే ఇద్దరు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వాళ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు యువకులను చంపేసిన తరువాత వారి శవాలను నీటి కుంటలో విసిరేశారని ఆరోపణలు ఉన్నారు.

Revenge: 2 dalit youths beaten to death men quits village near Tumakuru in Karnataka

హత్యకు గురైన ఇద్దరు యువకులు దళితులు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంట హత్య కేసుల విచారణకు భయపడిన గ్రామంలోని మగాళ్లు మొత్తం ఇప్పుడు ఊరు వదిలేసిపారిపోయారు. ఇప్పటికే 30 మందిని విచారణ చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణకు భయపడిన గ్రామంలో మద్య వయస్సు ఉన్న మగాళ్లు, యువకులు ఇప్పుడు భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను వదిలేసి గ్రామం వదిలిపారిపోయి వాళ్ల బంధువులు, స్నేహితుల నివాసంలో తలదాచుకుంటున్నారు. జంట హత్యల కేసును రాజకీయ లబ్దీ పొందడానికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే జంట హత్యల కేసును పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+