Revenge: రెండో భార్యతో భర్త ఎంజాయ్, 15 ఏళ్లకు మొదటి భార్యను చూడాలని వెళ్లి ?, నరికి చంపిన కొడుకు !
చెన్నై/ తంజావూరు: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వివాహం చేసుకున్న 9 ఏళ్ల తరువాత భర్త అతని భార్యను వదిలేసి వేరే మహిళను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. రెండో భార్యకు కూతురు ఉంది. రెండో భార్య, కూతురితో కలిసి జీవిస్తున్న భర్త అతని మొదటి భార్యకు పూర్తిగా దూరం అయ్యాడు. భర్త దూరం కావడంతో కష్టపడి ఆమె ఇద్దరు కొడుకులను పెంచి పోషించింది. 15 ఏళ్ల వరకు మొదటి భార్యతో పాటు ఇద్దరు కొడుకులను అతను ఒక్కసారి కూడా చూడలేదు. 15 ఏళ్ల తరువాత మొదటి భార్యను చూడాలని అనుకున్న భర్త ఆమె ఇంటికి వెళ్లాడు. 15 ఏళ్ల తరువాత ఒక్కసారికూడా రాని భర్త ఇంటికి వెళ్లడంతో మొదటి భార్య షాక్ అయ్యింది. ఆ సమయంలో మొదటి భార్య, భర్త, వాళ్ల కొడుకుల మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భార్య, ఆమె కొడుకు రెచ్చిపోయారు. ఇన్ని సంవత్సరాల తరువాత మేము బతికామా ?, చచ్చామా? అని చూడటానికి వచ్చావా ? అంటూ కొడుకు అతని తండ్రి మీద రగిలిపోయాడు. అంతే సహనం కోల్పోయిన కొడుకు కొడవలి తీసుకుని కన్నతండ్రిని నరికి చంపేయడం కలకలం రేపింది.

భార్యతో సంతోషంగా కాపురం చేసిన భర్త
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని నంజికోటై రోడ్డు ఇపీ కాలనీలోని సత్యానగర్ లో సెల్వా అలియాస్ చెరకు (46) అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. 25 ఏళ్ల క్రితం రాధిక (40) అనే మహిళను సెల్వా వివాహం చేసుకున్నాడు. రాధికను వివాహం చేసుకున్న సెల్వా మొదట కొన్ని సంవత్సరాలు అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు.

రెండో పెళ్లి చేసుకున్న భర్త
రాధిక, సెల్వా దంపతులకు జీవా, విక్రమ్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వివాహం చేసుకున్న 9 ఏళ్ల తరువాత సెల్వా అతని భార్య రాధికను వదిలేసి వెళ్లిపోయాడు. భార్యకు దూరం అయిన సెల్వా తంజైఎచ్చకోటై ప్రాంతంలో నివాసం ఉంటున్న శివశంకరి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. సెల్వా, అతని రెండో భార్య శివశంకరికి 15 ఏళ్ల కూతురు ఉంది. సెల్వా అతని రెండో భార్య శివశంకరి, కూతురితో కలిసి తిరువూరులో నివాసం ఉంటున్నాడు.

15 ఏళ్లలో భార్యను ఒక్కసారి కూడా చూడలేదు
రెండో భార్య శివశంకరి, కూతురితో కలిసి జీవిస్తున్న సెల్వా అతని మొదటి భార్య రాధికకు పూర్తిగా దూరం అయ్యాడు. భర్త సెల్వా పూర్తిగా దూరం కావడంతో రాధిక కష్టపడి ఆమె ఇద్దరు కొడుకులను పెంచి పోషించింది. రాధిక ఆమె కొడుకులు జీవా (23), విక్రమ్ (20)తో కలిసి జీవనం సాగిస్తోంది. 15 ఏళ్ల వరకు మొదటి భార్యతో పాటు ఇద్దరు కొడుకులను అతను ఒక్కసారి కూడా చూడలేదు.

భర్త ఇంటికి రావడంతో మొదటి భార్య షాక్
15 ఏళ్ల తరువాత మొదటి భార్య రాధికను చూడాలని అనుకున్న సెల్వా తిరువూరు నుంచి నేరుగా మొదటి భార్య నివాసం ఉంటున్న సొంతఊరికి వెళ్లాడు. 15 ఏళ్ల తరువాత ఒక్కసారికూడా రాని భర్త సెల్వా ఇంటికి వెళ్లడంతో మొదటి భార్య రాధిక షాక్ అయ్యింది. ఆ సమయంలో మొదటి భార్య రాధిక, భర్త సెల్వాతో పాటు వాళ్ల కొడుకులు జీవా, విక్రమ్ ల మద్య వాగ్వివాదం జరిగింది.

భర్త మీద దాడి చేసిన మొదటి భార్య
ఆ సమయంలో సహనం కోల్పోయిన భార్య రాధిక రోకలి, గడ్డపార తీసుకుని ఆమె భర్త సెల్వా మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో రాధిక కొడుకు జీవా రెచ్చిపోయాడు. ఇన్ని సంవత్సరాల తరువాత మేము బతికామా ?, చచ్చామా? అని చూడటానికి వచ్చావా ? అంటూ కొడుకు జీవా అతని తండ్రి సెల్వా మీద రగిలిపోయాడు.

తండ్రిని నరికి చంపేసిన కొడుకు
అంతే సహనం కోల్పోయిన కొడుకు జీవా కొడవలి తీసుకుని కన్నతండ్రి సెల్వాను నరికి చంపేయడం కలకలం రేపింది. తండ్రి సెల్వాను చంపేసి తప్పించుకుని పారిపోయిన జీవాను పోలీసులు అరెస్టు చేశారు. కన్న కొడుకు జీవా చేతితో అతని తండ్రి దారుణ హత్యకు గురికావడం తంజావూరులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications