చెల్లెలు కోసం మరిదిని బెడ్ రూమ్‌లోకి పిలిచి.. హవ్వా ఆ పని చేసేసింది..!
మనిషిలో స్వార్థం, ప్రతీకారం ఎంతటి క్రూరమైన చర్యకైనా పాల్పడేలా చేస్తాయి. ఆ పగ కుటుంబ బంధాలను, రక్త సంబంధాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో తాజాగా జరిగిన ఒక దారుణ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రా బర్హన్ ప్రాంతానికి చెందిన యోగేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, హల్ద్వాణీలో ఉన్న అల్ట్రాటెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు, అన్నయ్య రాజ్ బహదూర్, వదిన అర్చన ఉన్నారు. వదిన అర్చన తన చెల్లెల్ని యోగేష్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కంది. తన చెల్లెలు కూడా తమ ఇంటికే కోడలిగా వస్తే ఇద్దరూ కలిసి ఉండొచ్చని ఆమె ఆశపడింది.

అయితే, యోగేష్ మెయిన్‌పురికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇటీవలనే నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుని, నవంబర్‌లో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.ఇదే విషయంపై పగ పెంచుకున్న అర్చన..దీపావళి పండుగ రోజున దారుణానికి ఒడిగట్టింది. మధ్యాహ్నం పూజ పూర్తయిన తర్వాత అర్చన, యోగేష్‌ను తన గదిలోకి పిలిచి, తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని మరోసారి ఒత్తిడి చేసింది.
యోగేష్ ఆమె మాట వినకపోవడంతో, కోపంతో ఊగిపోయిన అర్చన కత్తి తీసి దాడి చేసింది. నా చెల్లెలికి దక్కని నువ్వు, వేరే అమ్మాయికి కూడా దక్కకూడదంటూ మరిది పురుషాంగాన్ని కోసిపడేసింది. యోగేష్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే గదిలోకి పరుగులు తీయగా, తీవ్ర రక్తస్రావంతో యోగేష్ నేలపై పడిపోయి కనిపించాడు.
కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు యోగేష్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. యోగేష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అర్చనతో పాటు ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications