Miss Universe India 2024: మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని దక్కించుకున్న రియా సింఘా..
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా టైటిల్ సాధించారు. ఇప్పుడు ఆమె మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశం నుంచి పోటీ పడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా తనకు రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు తనకు మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకునట్లు చెప్పారు. ఈ స్థాయికి చేరుకోవడానికి తను చాలా కష్టపడినట్లు ఆమె వివరించారు.
"ప్రతి ఒక్కరికీ నేను నిజంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. నేను ఈ కిరీటానికి అర్హురాలినని భావించగలను" అని రియా సింఘా తెలిపారు. ఈ ఈవెంట్‌లో న్యాయనిర్ణేతగా నటి, మిస్ యూనివర్స్ ఇండియా 2015 ఊర్వశి రౌటేలా వ్యవహరించారు. ఊర్వశి రౌతేలా రియాను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ సంవత్సరం భారతదేశం మళ్లీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంటుందని ఊర్వశి రౌటేలా ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ఫైనల్ చివరి రౌండ్ లో 10 మంది పోటీదారులు పోటీ పట్టారు. చివరి ప్రశ్న సమాధానం ఇచ్చి రియా న్యాయనిర్ణేతల హృదయాలను గెలుచుకున్నారు.

జడ్జి ప్యానెల్‌లో నిఖిల్ ఆనంద్, నటి మరియు మాజీ అందాల భామ ఊర్వశి రౌటేలా, వియత్నామీస్ స్టార్ న్గుయెన్ క్విన్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రియాన్ ఫెర్నాండెజ్, పారిశ్రామికవేత్త రాజీవ్ శ్రీవాస్తవ ఉన్నారు. గుజరాత్‌కు చెందిన 18 ఏళ్ల రియా సింఘా ఇప్పుడు మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024లో భారత్ తరఫున పోటీ పడనుంది.












Click it and Unblock the Notifications