పాండవులతో కాంగ్రెస్ గుర్తింపు పొందాలనుకొంటుంది: నిర్మలా సీతారామన్
Recommended Video

న్యూఢిల్లీ: బిజెపిపై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం నాడు కాంగ్రెస్ ప్లీనరీ ముగింపు సభలో బిజెపి నేతలపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎవరైతే రాముడి ఉనికిని ప్రశ్నించారో.. ఇప్పుడు ఆ పార్టీయే పాండవులతో గుర్తింపు పొందాలని చూస్తోందన్నారు. హిందువులను, విశ్వాసాలను ఎగతాళి చేసిన పార్టీ ఇప్పుడు హిందూ దేవతల గురించి మాట్లాడడాన్ని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.

సాంకేతికను కూడ ఇష్టపడని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. పారదర్శకతను కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడ నమ్మదని చెప్పారు.
పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తన తండ్రి, నానమ్మ కాలంలో మీడియాపై విధించిన ఆంక్షలను గుర్తుంచుకోవాలని సూచించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు అమిత్ షా పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై స్పందించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ పై ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. షోహ్రబుద్దీన్ కేసుల్ అమిత్ షాకు సిబిఐ క్లిన్చీట్ లభించిందన్నారు. అమిత్ షాపై ఎలాంటి కేసులు లేవని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications