బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది: ప్రశాంత్ కిషోర్ సంచలనం

ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఇటీవల పట్నాలోని గాంధీ మైదానంలో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్‌ కుమార్ తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో బీజేపీ నుంచి 14 మంది, జేడీయూ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా బిహార్ పోల్స్ పై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మహిళలకు రూ. 10, 000 చొప్పున అందజేశారని ఆరోపించారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రిగ్గింగ్ చేసి విజయం సాధించిందని అన్నారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతం తమ దగ్గర లేవని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీల పరంగా నెలలపాటు ఫీడ్ బ్యాక్ సమకూర్చుకున్నామని వాటి ఆధారాలు.. ఫలితాల ఆధారాలకు పొంతన లేదని స్పష్టం చేశారు. ఏదో తప్పు జరిగిందని తాను నమ్ముతున్నట్లు వివరించారు.

"చిన్నచిన్న పార్టీలకు కూడా లక్షల ఓట్లు వచ్చాయి. ఈ విజయంపై ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నా గొంతు వినిపించాలని వాళ్లు కోరుతున్నారు. ఈవీఎంలను మానిపులేట్ చేసినట్లు చెబుతున్నారు. కానీ నా దగ్గర ఆధారాలు లేవు. ఏదో తప్పు జరిగింది. కానీ అది ఏంటో తెలియదు" అని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి.. రాష్ట్రంలోని వేలమంది మహిళా ఓటర్లకు డబ్బులు పంచిందని ఆరోపించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక బిహార్​ 243 అసెంబ్లీ సీట్లకుగాను ప్రశాంత్​ కిశోర్​ ​ పార్టీ 238 సీట్లలోనూ పోటీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఒక్కసీటు గెలువలేకపోయింది.

Rigged Mandate Prashant Kishor Drops Bombshell on Bihar Elections Wipeout

ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. నవంబర్ 14 న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసిన ఎన్డీయే కూటమి 202 చోట్ల గెలిచింది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ- రామ్‌ విలాస్ పాస్వాన్‌ 19, హెచ్‌ ఏఎం పార్టీ 5, ఆర్‌ ఎల్‌ ఎం పార్టీ 4 స్థానాల్లో గెలిచింది. రాష్ట్రంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+