ఎంపీలో కలకలం.. స్కూల్‌పై భజరంగ్ దళ్ దాడి.. ఎందుకంటే
మధ్యప్రదేశ్‌లో క్రిస్టియన్ మిషనరీ ఇనిస్టిట్యూట్‌పై భజరంగ్ దళ్/ రైట్ వింగ్ గ్రూపు దాడికి తెగబడింది. రాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. దాడి జరిగే సమయంలో స్కూల్‌లో 12వ తరగతి విద్యార్థులు మ్యాస్ పరీక్ష రాస్తున్నారు. అయితే దాడి నుంచి విద్యార్థులు, సిబ్బంది వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు.
అయితే స్కూల్‌లో 8 మంది విద్యార్థులు మతం మారారనే విషయం తెలిసింది. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. భజరంగ్ దళ్ స్పందించింది. స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాడి గురించి ముందే మెనేజ్ మెంట్‌కు తెలుసు.. ఫలానా కారణంతో దాడి చేస్తామని వారు చెప్పేవారు. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందజేశారు. కానీ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయ్యారు. సరయిన భద్రతా చర్యలు తీసుకొని ఉంటే ప్రాబ్లమ్ ఉండేది కాదు.

Recommended Video
మిగతా మిషనరీ స్కూల్‌పై కూడా ఫోకస్ చేశారు. తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ యాజమాన్యం తెలిపింది.












Click it and Unblock the Notifications