భగ్గుమన్న పెట్రోల్ ధరలు... లీటర్ పెట్రోల్ ధర రూ.90

Recommended Video

    పెరిగిన పెట్రోల్ ధర..లీటరు రూ.90

    సామాన్యుడిపై గుదిబండలా మారాయి పెట్రోల్ ధరలు. రోజు రోజుకూ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యుడు ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయిస్తున్నాడు. తాజాగా ఇంధనం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 మార్కును దాటింది. మరో పది రోజులు పోతే ఇదికాస్త రూ. 100 అయ్యే అవకాశం ఉందని ఆందోళన సామాన్యులు వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం ఇంధన ధరలు నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని సామాన్యుడు హెచ్చరిస్తున్నాడు. మిగతా దేశాలతో పోలిస్తే ఒక్క భారత్‌లోనే ఎందుకింత విపరీతంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు.

    ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.08. హైదరాబాద్‌లో రూ.87.58. ఢిల్లీలో రూ.82.72. కోల్‌కతాలో రూ.84.44. ఇక ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.78.58. హైదరాబాద్‌లో రూ.80.46. ఢిల్లీలో రూ.74.02. కోల్‌కతాలో రూ.84.44. గత ఐదు నెలల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.4.66, డీజిల్‌పై రూ.6.35 ధర పెరిగింది.

    Rise in fuel price..litre Petrol touches Rs.90 mark

    ఒకవైపు రూపాయి విలువ పతనమవుతుండటం, మరోవైపు ముడిచమురు ధరలు పెరిగిపోతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆగష్టు రెండో వారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి. పెరుగుతున్న ఈ ధరలకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+