భవిష్యత్తు భయంకరం! కడలిలో కలిసిపోనున్న భారత నగరాలు ఇవే!!
సుందర్‌బన్స్‌లోని మడ అడవులను ప్రపంచంలోనే అతిపెద్ద సహజ రక్షణ కవచంగా పరిగణిస్తారు. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఈ కవచం ఇప్పుడు బలహీనపడుతోంది. గత 30 ఏళ్లలో భంగాదూని, జంబుద్వీప్ వంటి ద్వీపాలు దాదాపుగా సముద్రంలో కలిసిపోయాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) 2023 నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2021 నుండి 7.43 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ మడ అడవులు 2 చదరపు కిలోమీటర్లు, గుజరాత్‌లో ఏకంగా 36 చదరపు కిలోమీటర్లు తగ్గిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ఇండియాలోని 113 తీరప్రాంత నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంది.
30 ఏళ్లలో భంగాదూని, జంబుద్వీప్ ఎలా మాయమయ్యాయి?
సుందర్బన్స్ దక్షిణ చివరలో ఉన్న భంగాదూని ద్వీపం కథ అత్యంత విషాదకరం. 1975లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లలో ఇది పచ్చని మడ ద్వీపంగా కనిపించింది. 1991లో ల్యాండ్‌శాట్-5 ఉపగ్రహ చిత్రాలలో సముద్రపు అలలు, ఉప్పు నీటి కారణంగా మడ అడవుల వేర్లు బలహీనపడి ద్వీపం కుంచించుకుపోయినట్లు తేలింది. 2016లో ల్యాండ్‌శాట్-8 చిత్రాల ప్రకారం, ఈ ద్వీపం 1975లో ఉన్న దానికంటే సగానికి తగ్గిపోయింది. ఎఫ్‌ఎస్‌ఐ అధికారి అనుపమ్ ఘోష్ ప్రకారం.. 1991-2016 మధ్య 23 చదరపు కిలోమీటర్ల భూమిని సముద్రం మింగేసింది. జంబుద్వీప్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2016 నాటికి దీని పరిమాణం తగ్గడమే కాకుండా, కింది భాగం అలల తాకిడికి కదిలి, ద్వీపం స్థానం కూడా మారిపోయింది. నాసా (NASA), డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (WWF) 2024-2025 డేటా ప్రకారం, సుందర్బన్స్‌లో భూమి ఏటా 3 సెం.మీ. వరకు సముద్రంలోకి కుంగిపోతోంది, ఇది ప్రపంచ సగటు కంటే రెట్టింపు.

ద్వీపాలను సముద్రం ఎందుకు మింగేస్తోంది?
దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరగడం. ఐపీసీసీ 2023 నివేదిక ప్రకారం, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణ వ్యాకోచం, హిమాలయాల మంచు కరగడం కారణంగా సముద్ర మట్టం పెరుగుతోంది. సుందర్బన్స్‌లో సముద్ర మట్టం ఏటా 3.9 మి.మీ. పెరుగుతోంది (ప్రపంచ సగటు 1.7 మి.మీ. కంటే రెట్టింపు). 2100 నాటికి ఇది 62-87 సెం.మీ. పెరగవచ్చు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, తీరరేఖలో 97 శాతం కోతకు గురవుతోంది. 1969-2001 మధ్య 163 చదరపు కిలోమీటర్ల భూమి అదృశ్యమైంది. పెరుగుతున్న లవణీయత (ఉప్పు శాతం) మట్టిని బంధించి ఉంచే మడ అడవుల వేళ్లను నాశనం చేస్తోంది. ఆనకట్టల నిర్మాణం వల్ల గంగా-బ్రహ్మపుత్ర నదుల నీటి ప్రవాహం తగ్గడం, చేపలు పట్టే వలల వల్ల మడ అడవులు నాశనం కావడం కూడా దీనికి దోహదపడుతున్నాయి. 2019-2024 మధ్య ఫణి, అంఫన్, యాస్ వంటి తుఫానులు 40,000 ఇళ్లను ధ్వంసం చేశాయి.
2050 నాటికి ముప్పులో ఉన్న భారతీయ నగరాలు ఇవే..
డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇన్కోయిస్ (WWF-INCOIS) 2025, ఐడీఆర్ (IDR) 2024 నివేదికల ప్రకారం.. భారతదేశంలోని అనేక తీరప్రాంతాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి.
*సుందర్బన్స్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. 15 శాతాలు ద్వీపాలు నీట మునిగిపోతాయి. దాదాపు 45 లక్షల మంది నిరాశ్రయులవుతారు.ఘోరామారా, ముసునీ, సాగర్ దీవులు ప్రమాదంలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
*ముంబై (మహారాష్ట్ర) నగరం కూడా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తీర ప్రాంతంలో ఏటా 2 మి.మీ. చొప్పున భూమి కుంగిపోతోంది. 2 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రమాదంలో ఉన్నారు.
*
చెన్నై (తమిళనాడు) నగరం కూడా ప్రమాదం ఉంది. వరదలు, తీరప్రాంత కోత కారణంగా 70 లక్షల మంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి.
*భావ్‌నగర్ (గుజరాత్) వద్ద సముద్ర మట్టం 87 సెం.మీ. వరకు పెరిగే అవకాశం ఉంది. 10 లక్షల మందికి పైగా ప్రమాదంలో ఉన్నారు.
*కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చి నగరాలు కూడా ప్రమాదంలో ఉన్న దేశంలోని 113 తీరప్రాంత నగరాల జాబితాలో ఉన్నాయి. 1500 చదరపు కిలోమీటర్ల భూమి 2050 నాటికి కోత కారణంగా అదృశ్యమవుతుందని WRI అంచనా వేసింది.
ముప్పును ఎదుర్కోవడానికి చేయాల్సింది ఏమిటి?
ఈ సంక్షోభం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, లక్షలాది మంది జీవితాలకు సంబంధించినది. ప్రభుత్వం మడ అడవుల పునరుద్ధరణ, సీ-వాల్స్ నిర్మాణం, పటిష్టమైన వాతావరణ అనుకూల విధానాలపై దృష్టి సారించాలి. లేకపోతే సుందర్బన్ మాదిరిగానే దేశంలోని మొత్తం తీరప్రాంతం సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications