నాన్నాకు నవ వధువు టెర్రిబుల్ వాయిస్ నోట్..!!
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారమె. పెళ్లయిన రెండున్నర నెలల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుందంటే- ఆ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
మృతురాలి పేరు.. రిథన్య. వయస్సు 27 సంవత్సరాలు. తిరుప్పూర్ కు చెందిన గార్మెంట్ సంస్థ యజమాని కెవిన్ కుమార్‌తో ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన వివాహం జరిగింది. వివాహ సమయంలో రిథన్య కుటుంబ సభ్యులు 300 సవర్ల బంగారం, 70 లక్షల రూపాయల విలువ చేసే వోల్వో కారును కట్నంగా ఇచ్చారు. 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి జరిపించారు రిథన్య తండ్రి ఆర్ జీ అన్నాదురై.

వేధింపులు..
వివాహం తర్వాత అదనంగా 200 సవర్ల బంగారం ఇస్తామని మాట ఇచ్చారు. ఇంత భారీగా కట్నం ఇచ్చినప్పటికీ- వివాహం జరిగిన కొద్ది రోజులకే వేధింపులు మొదలయ్యాయని రిథన్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తోన్నారు. మిగిలిన 200 సవర్ల కోసం భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవి.. రిథన్యను తీవ్రంగా వేధించారు.
రెండున్నర నెలలకే..
దీంతో అన్నదురై, ఆయన భార్య కలుగజేసుకుని రిథన్యను ఇంటికి తీసుకువచ్చారు. కెవిన్ అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లేవాడు. 20 రోజుల తర్వాత ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. జూన్ 22వ తేదీన రిథన్య, కెవిన్‌తో కలిసి తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఆమె చాలా బాధగా, దిగాలుగా కనిపించారు.
తిరిగి వెళ్లడం ఇష్టం లేక..
ఎలాంటి గొడవ జరగలేదని, ఆమె కేవలం తన తల్లిదండ్రుల వద్ద ఉండాలని కోరుకుంటుందని కెవిన్ చెప్పాడు. మరుసటి రోజు అతను ఆమెను చూడటానికి వచ్చాడు. సమస్య గురించి అడిగినప్పుడు, రిథాన్య మొదట చెప్పడానికి నిరాకరించింది. అత్తవారి ఇంటికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడటం లేదని మాత్రమే చెప్పింది.
పురుగుల మందు సేవించి..
శనివారం మధ్యాహ్నం తలక్కరై లక్ష్మీ నరసింహ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించిన అనంతరం.. రిథన్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. సేయూర్ టౌన్ లో పురుగుల మందును కొనుగోలు చేశారు. ఆ తర్వాత మొండిపాళ్యం పెరుమాళ్ ఆలయానికి వెళ్లి రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో పురుగుల మందు సేవించి, ఆత్మహత్య చేసుకున్నారు.
భర్త, అత్తమామల అరెస్ట్..
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను వెంటనే అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కవిన్ కుమార్, ఈశ్వరమూర్తి, చిత్రదేవిని అదుపులోకి తీసుకున్నారు.
ఏడు వాయిస్ నోట్స్..
ఆత్మహత్య చేసుకునే ముందు, రిథాన్య తన తండ్రికి వాట్సాప్ ద్వారా ఓ ఆవేదనాభరిత వాయిస్ నోట్‌ను పంపించారు. భర్త, అత్తమామలు తనను ఎంతగా వేధింపులకు గురి చేశారో వివరించారు. ఈ విషయాన్ని బయటి వాళ్లతో చెబితే తన పరువు పోతుందని, చనిపోతానని భర్త కవిన్ కుమార్ బెదిరించే వాడని రిథాన్య ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను క్షమించండి నాన్నా..
"నన్ను క్షమించండి నాన్నా. నన్ను ఎవరూ కాపాడాలని నేను కోరుకోవట్లేదు. నా జీవితం మారుతుందని ఇంతకాలం ఆశించాను. ఓపికగా భరించాను. అది సాధ్యం కాదని అర్థమైంది.." అని తండ్రికి వాయిస్ నోట్ పంపించారు. మొత్తం ఏడు వాయిస్ నోట్స్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అతనితో జీవించలేను..
"నేను అతనితో జీవించలేను. అతను, అతని కుటుంబ సభ్యులు నేరస్తులు. నా జీవితాన్ని నాశనం చేయడానికి వారు ప్లాన్ చేశారు" అని చెప్పారు. "నేను అతనితో జీవించాలనుకోవడం లేదు. ఈ వివాహాన్ని విడిచిపెట్టి మరో జీవితాన్ని ఎంచుకోలేను.." అని కన్నీరు పెట్టుకున్నారు రిథన్య. జీవించాలనే ఆశ చచ్చిపోయింది. నా జీవితం బాగా లేదు. అన్నీ అయిపోయాయి.." అని తెలిపారు.
ఇప్పటి వరకు చేసింది చాలు..
"ఇప్పటి వరకు వాళ్లకు (అత్తింటివారు) చేసింది చాలు. నేను ఇక భరించలేను. నా నిర్ణయం పట్ల మీకు కోపం వస్తుందని, మీరు నన్ను ద్వేషిస్తారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని బాధపెట్టలేను. సమాజం కోసం మనశ్శాంతి లేకుండా జీవించలేను.." అని వాపోయారు.
ఎలాంటి ఆశ లేదు..
"ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా లేదా నన్ను గుడికి తీసుకెళ్లడం ద్వారా లేదా జాతకాలు చూడటం ద్వారా పరిష్కరించలేమని నాకు అర్థమైపోయింది. నన్ను క్షమించండి నాన్నా. నేను నిజంగా జీవించాలనుకోవడం లేదు. నాకు ఎలాంటి ఆశ లేదు. మీరు (నాన్న), అమ్మ నా ప్రపంచం. నేను మీకు చాలా బాధ కలిగించాను. నన్ను క్షమించండి నాన్నా. నన్ను క్షమించండి అమ్మా. నేను వెళ్ళిపోతున్నాను" అని ఆమె తన చివరి వాయిస్ నోట్ లో చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications