మాజీ సీఎంకు మోదీ ఆశీస్సులు, ప్రత్యర్థులు ఏం చేశారంటే?, ఒకే పేరుతో ఐదు మంది పోటీ!
లోక్ సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం ప్రారంభించారు. ఏఐడీఎంకే పార్టీపై తిరుగుబాటు చేసి ఆ పార్టీ సింబల్ కోసం న్యాయపోరాటం చేస్తున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
తమిళనాడులోని రామనాథపురంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయే మద్దతుతో, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో పన్నీర్ సెల్వం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను టార్గెట్ చేసిన ఆయన ప్రత్యర్థులు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వేశారు.

ఏఐఏడీఎంకేలో జయలలిత ఎంతో నమ్మకం పెట్టుకున్న ఏకైక వ్యక్తిగా ఓ పన్నీర్ సెల్వం గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జయలలిత జైలుకు వెళ్లే సమయంలో ఓ పన్నీర్ సెల్వం ను సీఎం చేసిన తరువాత ఆమె జైలుకు వెళ్లారు అంటే ఓ పన్నీర్ సెల్వం అమ్మ జయలలిత దగ్గర ఎంత మంచి పేరు సంపాధించుకున్నారో అర్థం అవుతోంది. ఇప్పుడు అదే ఓ పన్నీర్ సెల్వంను ఓడించడానికి రామనాథపురంలో అదే పేరుతో ఉన్న నగులురు ఓ పన్నీర్ సెల్వంలను లోక్ సభ ఎన్నికల రంగంలోకి దింపారు.
ఓ పన్నీర్ సెల్వం పేరుతో ఉన్న నలుగురు వ్యక్తులు ఇప్పుడు రామనాథపురం లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దింపి మాజీ మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంకు షాక్ ఇచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న తరువాత ఆయనకు రామనాథపురం లోక్ సభ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ.పన్నీర్‌సెల్వం స్వతంత్ర గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రామనాథపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇండియా కూటమి తరపున ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థి నవాజ్ ఘనీ, ఏఐఏడీఎంకే తరపున జయ పెరుమాళ్ పోటీ చేస్తున్నారు.
రామనాథపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఓ. పన్నీర్‌సెల్వం నామినేషన్ దాఖలు చేయడంతో మళ్లీ ఓ. పన్నీర్ సెల్వం అనే నలుగురు వ్యక్తులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇలా రామనాథపురంలో మొత్తం ఓ. పన్నీర్ సెల్వం పేరుతో ఐదు మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని ముస్లిం లీగ్ ప్రయత్నిస్తున్నది. ఈలోగా నకిలీ అభ్యర్థుల బెడదతో ఎన్డీయే తరపున బరిలోకి దిగుతున్న మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంకు పెద్ద తలనొప్పి వచ్చింది.
పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకు ఓ.పన్నీర్ సెల్వం ప్రత్యర్థులు ఇలా చేశారని ఆయన వర్గీయులు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రముఖుల పేర్లతో ఉన్న వాళ్లు ఎన్నికల్లో పోటీ చెయ్యడం రాజకీయాల్లో కొత్త కాదు. 2011లో తమిళనాడులో విజయకాంత్ ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు అదే పేరున్న విజయకాంత్ లు కొందరు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యలో సుమలత పేరుతో ఉన్న సుమలత అనే పేరు ఉన్న మరో నలుగురు మహిళలు పోటీ చేశారు. అయితే సుమలత అంబరీష్ ఆ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications