నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా: సెహ్వాగ్-గుర్మెహర్‌కు ఆర్జే నవేద్
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్‌కు, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓ విషయం చెప్పదలుచుకున్నట్లు రేడియో మిర్చి ఆర్జే నవేద్ పేర్కొన్నారు.
ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్‌కు, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓ విషయం చెప్పదలుచుకున్నట్లు రేడియో మిర్చి ఆర్జే నవేద్ పేర్కొన్నారు.
కార్గిల్ అమర సైనికుడి కుమార్తె గుర్మెహర్ రాంజాన్ కాలేజీ అల్లర్ల నేపథ్యంలో సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ తన తండ్రిని హతమార్చలేదని, యుద్ధం హతమార్చిందని గుర్మెహర్ ప్లకార్డు పట్టుకుని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. దీనిపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. తాను మూడు శతకాలు చేయలేదని, తన బ్యాట్ చేసిందని కౌంటర్ ఇచ్చారు.

అయితే ఈ సంఘటనపై తాజాగా రేడియో మిర్చి ఆర్జే నవేద్ స్పందించారు. తన అభిప్రాయాన్ని ప్లకార్డుల ద్వారా తెలుపుతూ మార్చి 2న ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
దాదాపు మూడు లక్షల మంది దీన్ని చూశారు. ప్రియమైన గుర్మెహర్ కౌర్, వీరేంద్ర సెహ్వాగ్.. మీ ఇద్దరి నేనొకటి చెప్పాలనుకుంటున్నానని, మీకే కాదు దేశంలోని జాతీయవాదులకు, వ్యతిరేక జాతీయవాదులకు, పాకిస్థాన్ వెళ్లాలనుకునే వారికి తాను ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని, కాగితాన్ని వృథా చేయడం ఆపండని నవేద్ వీడియోలో ప్లకార్డులు చూపించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications