పెళ్లైన మూణ్నెళ్లకే రేడియో జాకీ భార్య ఆత్మహత్య

అహ్మదాబాద్: రేడియా జాకీ కునాల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. సచిన్ టవర్ పదో అంతస్థు ఫ్లాట్ నుంచి కిందికి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనంద్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పివి జడేజా చెప్పారు. వారిద్దరికి గత నవంబర్‌లోనే వివాహం జరిగింది.

పాతికేళ్ల భూమి దేశాయ్ కునాల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఓ పోటీలో బహుమతి గెలుచుకున్న దేశాయ్‌కి ప్రముఖ ప్రైవేట్ రేడియో స్టేషన్‌లో పనిచేస్తున్న ఆరె కునాల్ పరిచమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.

పెద్దల అంగీకారంతో నిరుడు నవంబర్ 24వ తేదీన వివాహం చేసుకున్నారు. హానీమూన్మ కోసం బ్యాంకాక్ వెళ్లిన జంట జనవరి 18వ తేదీన తిరిగి వచ్చింది. అక్కడే ఇరువురి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.

RJ’s wife jumps off 10-floor flat, dies

ఆ తర్వాత ఏమైందో తెలియదు. అయితే సచిన్ టవర్ దగ్గర సూసైడ్ చేసుకుంటున్నట్లు గురువారం మధ్యాహ్నం మెసేజ్ పెట్టి ఆ తర్వాత భవనంపై నుంచి దూకేసింది. ఆత్మహత్య చేసుకోవడానికే ఆమె తన నివాసం నుంచి అపార్టుమెంటుకు వచ్చినట్లు భావిస్తున్నారు.

ఆమె తల్లిదండ్రుల ఇల్లు నెహ్రూనగర్‌లోని అంబావాడిలో ఉంటుంది. సచిన్ టవర్ శ్యామల్ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆమె ఇక్కడికి కారులో వచ్చింది. ఫ్రెండ్ మితేష్ సోనీకి మెసేజ్ పెట్టిన కొద్ది సేపటికే ఆమె భవనంపై నుంచి దూకింది. ఆమెను ఆపడానికి ఫ్రెండ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు.

భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమేమిటని, ఆమె ఆత్మహత్యకు గల బలమైన కారణం ఏమిటనేది తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కునాల్‌తో భూమికి రెండో వివాహం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+