వామ్మో ఇదేంది.. లైంగికదాడి చేసినవారి.. భార్యలకు టికెట్ల్, ఇద్దరినీ ప్రకటించిన ఆర్జేడీ..
బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే నేరచరితులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ వారి భార్యలకు మాత్రం టికెట్లు ఇస్తున్నారు. ఇందులో ఆర్జేడీ ముందువరసలో నిలిచింది. రెండు టికెట్లను నేరచరిత/ లైంగికదాడి చేసిన వారి భార్యలకు టికెట్లను ఇచ్చింది. ఇదీ చర్చకు దారితీసింది.
మోడీ విందుకు ఆర్జేడీ డుమ్మా .. ఎందుకో తెలుసా ..?
1990లో జరిగిన పశు దాణా కుంభకోణం కేసులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లైంగికదాడి చేసిన ఇద్దరికీ పార్టీ టికెట్ ఇవ్వలేదు. కానీ వారి భార్యలకు ఇచ్చి.. తమ నైజాన్ని ఆర్జేడీ చాటిచెప్పింది. దీనిని విపక్షాలు అస్త్రంగా మలచుకొని విమర్శలు చేసే అవకాశం ఉంది.

రాజ్ బల్లాభ్ యాదవ్.. మైనర్ బాలికపై లైంగికదాడి చేశారు. నేరాభియోగం రుజువుకావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో నావడ అసెంబ్లీ స్థానం నుంచి విభా దేవిని బరిలోకి దింపింది. మరోవైపు సందేశ్ నియోజకవర్గం నుంచి కిరణ్ దేవి పోటీకి దిగారు. ఆమె భర్త అరుణ్ యాదవ్ లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఏడాది నుంచి పరారీలో ఉన్నారు.
బీహర్‌లో కాంగ్రెస్, లెప్ట్ పార్టీలతో కలిసి ఆర్జేడీ కలిసి పోటీచేస్తోంది. సీట్ల పంపకం కుదిరన తర్వాతే ఆర్జేడీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీహర్‌లో తమకు 15 స్థానాల్లో పోటీ చేస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా కోరింది. కానీ ఆ ప్రాతిపదనను ఆర్జేడీ తోసిపుచ్చింది.