Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నితీష్ ను మోడీ పొగిడాడు, ఆర్ జె డి నేతల అసంతృప్తి

బీహర్ రాష్ట్రంలో ఆర్ జెడి , జెడియూ నేతల మధ్య అసంతృప్తి కొనసాగుతోంది. కొంత కాలం క్రితం బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై పరోక్ష ఆరోపణలను ఆర్ జెడి చీఫ్ లాలూ ప్రసాద్ చేశారు.

బీహర్ :బీహర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆర్ జె డి ,జెడియూ ల మధ్య అసంతృప్తి సెగలు రాజుకొంటున్నాయి.బీహర్ ముఖ్యమంత్రి నితీష్ ను ఉద్దేశించి ఆర్ జె డి నాయకులు పరోక్ష విమర్శలు చేస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నితీష్ ను ప్రశంసలతో ముంచెత్తితో ,ప్రధాని పాల్గొన్న సమావేశంలో లాలూకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆర్ జెడి నాయకులు మండిపడ్డారు.

పెద్దనగదు నోట్ల రద్దును బీహర్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్వాగతించారు. ఎన్ డి ఏ వ్యతిరేక పక్షాలకు చెందిన ముఖ్యమంత్రి ఈ అంశంపై తలోదారిని ఎంచుకొన్నారు. అయితే ఆర్ జె డి మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.

పెద్ద నగదునోట్ల రద్దు అంశంపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి జెడియూ హజరుకాలేదు. ఈ సమావేశానికి జెడియూ హజరుకాకపోవడాన్ని లాలూ తప్పుబట్టారు. పరోక్షంగా నితీష్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పొగడ్తలో ముంచెత్తాడు. అయితే ఇటీవల కాలంలో నితీష్ చేస్తోన్న కార్యక్రమాలు బిజెపికి దగ్గరయ్యేలా ఉన్నాయని కొందరు ఆయనపై విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలను నితీష్ కొట్టిపారేశారు. తాను బిజెపికి దగ్గరయ్యే పరిస్థితులు లేవన్నారు.

నితీస్ పై ఆగ్రహంతో ఉన్న ఆర్ జె డి

నితీస్ పై ఆగ్రహంతో ఉన్న ఆర్ జె డి

బీహర్ రాష్ట్రంలో గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్మమంలో వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రమే ఆసీనులయ్యారు. అయితే వేదిక కిందే లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నాయకులు కూర్చోన్నారు. ఈ ఘటనపై ఆర్ జె డి నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీరును తప్పుబట్టారు. మహకూటమి బీహర్ లో ప్రభుత్వాన్ని నడుపుతోందని, అలాంటి సమయంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు సమానమైన గౌరవాన్ని ఇవ్వాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానితో లాలూ కుమారుల విందు

ప్రధానితో లాలూ కుమారుల విందు

గురువారం నాడు ప్రధానమంత్రి గురుగోవింద్ సింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏర్పాటుచేసిన విందులో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బీహర్ ఉప ముఖ్యమంత్రిగా లాలూ పెద్ద కుమారుడు తేజస్వీయాదవ్ పనిచేస్తున్నాడు. మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా కొనసాగతున్నాడు వీరిద్దరూ కూడ ప్రధానమంత్రితో కలిసి విందు ఆరగించారు. ఇదే సందర్భంలో లాలూ తనయుడు ఆరోగ్య శాఖమంత్రి తేజ్ ప్రతాప్ ను నీవు కఈష్ణుడవయ్యావంటూ ప్రధానమంత్రి చమత్కరించారు.

వారిద్దరూ కలిసిపోయారా ?

వారిద్దరూ కలిసిపోయారా ?

నరేంద్రమోడీ , నితీష్ కుమార్ లు ఉప్పు నిప్పులా ఉండేవారు. బీహర్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో నితీష్ పై మోడీ విమర్శలు గుప్పించారు. నితీష్ కూడ అదే తరహలోనే మోడీపై ఘాటుగానే స్పందించారు. అయితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన హర్థిక్ పటేల్ ఇటీవలే నితీష్ తో సమావేశమయ్యారు. గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హార్థిక పటేల్ నితీష్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఇదిలా ఉంటే, బీహర్ లో జరిగిన గురుగోవింద్ సింగ్ జయంతి కార్యక్రమంలో నితీష్ పై ప్రధానమంత్రి మోడీ ప్రశంసలు కురిపించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. మద్యపాన నిషేధాన్ని కొనసాగించడం సామాన్య విషయం కాదన్నారు ప్రధాని.పెద్ద నగదు నోట్లను రద్దుచేయడాన్ని నితీష్ స్వాగతించారు.

మహకూటమితో నితీష్ కు ఇబ్బందులా

మహకూటమితో నితీష్ కు ఇబ్బందులా

కొంత కాలంగా మహకూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ ఆర్ జె డి నితీష్ వ్యవహరశైలిపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంది. పెద్ద నగదు నోట్ల రద్దుతో పాటు ఇతర అంశాలను ఆ పార్టీ చూపుతోంది. అయితే నితీష్ నాయకత్వంలోని జెడియూ కంటే ఆర్ జె డి కే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కాయి.అయితే మహకూటమి ఒప్పందం ప్రకారంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బీహర్ లో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పర్చాల్సిన భాద్యత ప్రభుత్వం నిర్వహించే వారిపై ఉంది. ఈ పరిస్థితులను దృస్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితులు నితీష్ పై ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+