ఘోరం: నిద్రిస్తున్న కుక్కపై రోడ్డు వేశారు, తారు వేడికి తట్టుకోలేక మృతి(వీడియో)

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న కుక్క పైనుంచే ఓ రోడ్డు నిర్మాణ సంస్థ సిబ్బంది రోడ్డు వేశారు. దీంతో ఆ శునకం మృతి చెందింది. ఈ ఘటన ఆగ్రాలోని ఫతేబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో తారు రోడ్డు వేస్తున్నారు. రోడ్డుకు చివరన ఓ కుక్క నిద్రపోతోంది. దాన్ని అక్కడి నుంచి తరమడమో లేదా పక్కకు తీసుకెళ్లడమో చేయకుండా అలాగే పొగలుకక్కుతున్న తారును దానిమీద పోశారు. ఆ తర్వాత దాన్ని రోడ్డు రోలర్‌తో తొక్కించారు. దీంతో ఆ కుక్క ప్రాణాలు విడిచింది.

Road Built Over Dogs Body In Agra. It Was Alive, Allege Residents

ఈ మేరకు నరేశ్ పరాస్ అనే సామాజిక కార్యకర్త జంతు హింస నిరోధక చట్టం కింద పోలీస్ స్టేషన్‌లో కూడా అతను ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

కాగా, ఆ కుక్క వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో రోడ్డు వేసిన ఆర్పీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పందించిన ప్రాజెక్టు కాంట్రాక్టర్.. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+