నా కంపెనీలు మూసేయండి: ప్రియాంక భర్త వాద్రా లేఖ

న్యూఢిల్లీ: తనకు సంబంధించిన ఆరు కంపెనీలను మూసేయమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. 2012లో నెలకొల్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీలు ఎలాంటి వ్యాపారం చేయడం లేదని వాటిని మూసేయాలని ఆయన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ ప్రైవేటు కంపెనీలను న్యాయబద్ధంగా మూసేయాలని కోరారు. తమ కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారాలని, రాజకీయ ప్రేరేపితాలేనని రాబర్ట్ వాద్రా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని పలు రాజకీయా పార్టీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Robert Vadra writes to government to shut down 6 of his companies

రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలపై స్టే పొడిగింపు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుల విడుదలపై సుప్రీం కోర్టు స్టే పొడిగించింది. నిందితుల విడుదలపై స్టేని జులై 22 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+