జైపుర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు - ఏఎస్సైతో సహా నలుగురు మృతి..!!
వందలాది ప్రయాణీకుల సమక్షంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జైపుర్- ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జవాన్ కాల్చిచంపారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన ఓ ఏఎస్సై, ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. పాల్ఘర్- ముంబై మధ్య దహిసర్‌లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన పోలీసు కానిస్టేబుల్ మీరా రోడ్డు సమీపంలో పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు.
ఈ ఉదయం 5 గంటల సమయంలో దహీసర్ వద్ద ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని పాల్గర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో ఒక్క సారిగా కానిస్టేబుల్ కాల్పులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది కాల్పులకు దిగిన కానిస్టేబుల్ ను చేతన్ గా గుర్తించారు.

కానిస్టేబుల్ తో పాటుగా ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఈశాన్య రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. కాల్పులు ఎందుకు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితుడిని విచాణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications