ఎలక్ట్రిక్ వెహికిల్ కొంటే బంపర్ ఆఫర్.. పన్ను రాయితీ ఎంతో తెలుసా..!!
న్యూఢిల్లీ : నవ భారతం కాలుష్య కాసారంగా మారుతుండటంతో కేంద్రం ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. కర్భన ఉద్గారాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మొక్కలను పెంచడం ప్రారంభించారు కూడా. కాలుష్యాన్ని నియంత్రించేందుకు పెట్రోల్, డిజీల్ వాహనాలు కాక .. ఎలక్ట్రిక్ వాహనాలను నడుపాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్‌లో రాయితీ కూడా ఇచ్చారు.
ఆఫర్ ..
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి వివిధ ప్రయోజనాలను కల్పిస్తోంది. పార్కింగ్ ఫ్రీ అని, ఇన్సూరెన్స్ లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో రాయితీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసిన వారికి రూ.లక్షన్నర పన్ను రాయితీ అందిస్తామని బంఫర్ ఆఫర్ పర్కటించారు. వారు వాహనం కొనుగోలు సమయంలోనే ఈ పన్ను రాయితీ అందజేస్తామని తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే తక్కువ జీఎస్టీ విధించిన సంగతి తెలసిందే. ఈ ప్రయోజనంతో వినియోగదారులు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

భారమే .. కానీ
దీంతో వినియోగదారులకు దాదాపు 2.5 లక్షల కోట్ల ప్రయోజనం కలుగుతుందని లెక్కగట్టారు. ఈ రాయితీ కేంద్రానికి భారమైనా .. ప్రజా ప్రయోజనాల కోసం కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే రూ.2.5 లక్షల విలువ, ఆపై ధర గల ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తేనే ఈ పన్ను రాయితీ వర్తిస్తుందని కండీషన్ విధించారు. ఓ దేశ పౌరుడిగా పన్ను కడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నిర్మలా. దేశాభివృద్ధి కోసం వారు కడుతున్న పన్ను వల్లే .. వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామని వివరించారు. దీంతోపాటు గృహ రుణాలకు కూడా రూ. లక్షన్నర రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. 2013-14లో పన్ను రాబడి రూ.6.37 కోట్లు ఉంటే .. 2018-19కి అది రూ.11.37 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications