మోడీ 'రద్దు'పై వన్ ఇండియా సర్వే: అంతా ఓకే, కానీ రూ.2000పై షాకిచ్చారు ఇలా...! (పిక్చర్స్)

ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశంలోని ప్రతి ఒక్కరు ఇదే అంశం గురించి మాట్లాడుకుంటున్నారు.

హైదరాబాద్/అమరావతి/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశంలోని ప్రతి ఒక్కరు ఇదే అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. నోట్ల రద్దు అనంతరం బ్యాంకులు, ఏటీఎంల ప్రజలు క్యూ కడుతున్నారు. చిల్లర లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

నోట్ల రద్దు పైన ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. నల్లధన నిర్మూలనకు ఓ వైపు రూ.500, రూ.1000 నోటు రద్దు చేస్తూనే, మరోవైపు రూ.2000 నోటు తీసుకు రావడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.

అలాగే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటా నోట్ల రద్దు చేయడం సరికాదని కొందరు చెబుతుండగా, అందులో తప్పులేదని మరికొంతమంది అంటున్నారు. నల్లధనం రూపుమాపాలంటే ఇలాంటి హఠాత్తు నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని, ప్రస్తుతానికి జనాలు ఇబ్బందిపడ్డా భవిష్యత్తు బాగుంటుందనేది ఎక్కువమంది వాదన.

మొత్తానికి నోట్ల రద్దు పైన గత పదిహేడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కలిసినా.. జనాల ఇబ్బందులు, నోట్ల రద్దు వల్ల లాభమా, నష్టమా, భవిష్యత్తు పరిణామాలు ఏమిటీ.. అనే విషయమై చర్చించుకుంటున్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఈ నేపథ్యంలో 'వన్ ఇండియా' నోట్ల రద్దు పైన అభిప్రాయం తెలుసుకునేందుకు ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేకు విశేష ఆధరణ లభించింది. సర్వేలో 31,198 మంది పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాత్ భాషలలో వన్ ఇండియా ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. పదకొండు ప్రశ్నలపై రీడర్స్ ఇలా స్పందించారు....

ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు

ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు

పెద్ద నోట్ల రద్దు పైన ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తారా అని ప్రశ్నిస్తే... 71.7 శాతం మంది అవునని సమాధానం చెప్పారు. 25.7 శాతం మంది మాత్రమే సమర్థించలేదు. తద్వారా ప్రభుత్వం నిర్ణయాన్ని ఎక్కువ మంది సమర్థించినట్లుగా కనిపిస్తోంది.

పబ్లిసిటీ స్టంట్ కాదు

పబ్లిసిటీ స్టంట్ కాదు

నోట్ల రద్దు వల్ల ఎలాంటి లాభం లేదని, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా భావిస్తున్నారా అని ప్రశ్నిస్తే.. 65 శాతానికి పైగా దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా భావించలేదు. మూడొంతుల కంటే కాస్త ఎక్కువ మంది ప్రధాని మోడీ ప్రకటనను పబ్లిసిటీ స్టంట్‌గా అభిప్రాయపడ్డారు.

రూ.2000 నోటు - నల్లధనం

రూ.2000 నోటు - నల్లధనం

నల్లధనాన్ని రూపుమాపేందుకు రూ.500, రూ.1000 నోటును రద్దు చేసిన ప్రభుత్వం రూ.2000 నోటును తీసుకు రావడాన్ని ఎక్కువ మంది తప్పుబట్టారు. పెద్ద నోట్లను రద్దుచేసి, మళ్లీ రూ.2000 నోటును తీసుకు రావడం సరికాదని సగం మందికి పైగా అభిప్రాయపడ్డారు. సగానికి తక్కువ మంది రూ.2000 నోటుతో ఇబ్బంది లేదని అభిప్రాయపడ్డారు. రూ.2000 నోటు విషయంలో మాత్రం మోడీ నిర్ణయాన్ని సగానికి ఎక్కువ మంది సమర్థించలేదు.

ముందు జాగ్రత్తలు తీసుకోలేదు

ముందు జాగ్రత్తలు తీసుకోలేదు

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతించారు. అయితే, ఇది రహస్యమైనప్పటికీ ప్రభుత్వం కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని ఎక్కువ మంది ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. రూ.500, ఇతర చిన్న నోట్లను ఎక్కువ మొత్తంలో ముందే విడుదల చేసి, ఆ తర్వాత రద్దు ప్రకటన చేస్తే జనాల ఇబ్బందులు తక్కువగా ఉండేవని అభిప్రాయపడ్డారు. దాదాపు అరవై శాతం మంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని సర్వేలో వెల్లడించారు.

అమలులో వైఫల్యం, కానీ

అమలులో వైఫల్యం, కానీ

నోట్ల రద్దు అమలులో వైఫల్యాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటోందని తాము భావించడం లేదని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. దాదాపు ముప్పై ఆరు శాతం మంది మాత్రం ప్రభుత్వం వైఫల్యాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.

కామన్ మ్యాన్‌కు ఉపయోగమే

కామన్ మ్యాన్‌కు ఉపయోగమే

నోట్ల రద్దు సగటు జీవికి ఉపయోగపడుతుందని ఎక్కువ మంది ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. దాదాపు అరవై శాతం మంది నోట్ల రద్దు దీర్ఘ కాలంలో కామన్ మ్యాన్‌కు ఉపయుక్తమని చెప్పారు. నలభై శాతానికి పైగా మాత్రం ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు.

నల్ల ధనం పూర్తిగా నిర్మూలించవచ్చా?

నల్ల ధనం పూర్తిగా నిర్మూలించవచ్చా?

రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో నల్ల ధనాన్ని పూర్తిగా రూపుమాపవచ్చునని సర్వేలో పాల్గొన్న సగానికి మంది పైగా అభిప్రాయపడ్డారు. ఇది ఓ అడుగు అని, క్రమంగా రూపుమాపవచ్చునని తేల్చారు. దాదాపు నలభై ఆరు శాతం మంది మాత్రం దీని వల్ల లాభం లేదని, ఈ నోట్లు రద్దు చేసినా రూ.2000 నోటు తీసుకు రావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.

నోట్ల రద్దు ఓకే

నోట్ల రద్దు ఓకే

నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని, దీనిని కొనసాగించాలని సర్వేలో పాల్గొన్న డెబ్బై శాతం మంది అభిప్రాయపడ్డారు. దాదాపు ముప్పై శాతం మంది మాత్రమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు. సాధారణ పౌరుడు ఇబ్బందులు పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం సరైనదని మూడింట రెండొంతులకు పైగా అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వమే ఇబ్బందులకు కారణం

ప్రభుత్వమే ఇబ్బందులకు కారణం

నోట్ల రద్దును ఎక్కువ మంది సమర్థించినప్పటికీ, ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, ఇందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి మోడీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సగం మంది ప్రభుత్వం వల్లే సాధారణ పౌరుడు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ముప్పై శాతం మంది ఆర్బీఐ వల్ల అని చెప్పగా, ఇరవై శాతం మంది బ్యాంకుల వల్ల ఇబ్బందులని చెప్పారు.

మోడీపై పూర్తి నమ్మకం

మోడీపై పూర్తి నమ్మకం

నోట్ల రద్దు నేపథ్యంలో యాభై రోజుల్లో అంతా సద్దుమణుగుతుందన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై దాదాపు మూడింట రెండు శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. 36 శాతం మంది మాత్రం మోడీ వ్యాఖ్యలపై నమ్మకం లేదన్నారు. ఈ సమస్య మరో నాలుగైదు నెలలు ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే.

ప్రభావం ఉండదు!

ప్రభావం ఉండదు!

రానున్న రాష్ట్రాల ఎన్నికల నాటికి నోట్ల రద్దు ప్రభావం ఏమీ కనిపించదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇలాంటి విషయాలను త్వరగా మరిచిపోతారని ఐదింట ఇద్దరికి పైగా అభిప్రాయపడ్డారు. బీజేపీకి లాభమని మూడింట ఇద్దరు చెప్పగా, మోడీకి ఎదురు దెబ్బ తగులుతుందని ఇరవై శాతం మంది చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+