Actress: నేరస్తుడని తెలిసి పెళ్లి చేసుకోవాలని బాలీవుడ్ హీరోయిన్ స్కెచ్, రూ. 215 కోట్ల మహిమ !
ముంబాయి/ బెంగళూరు/ తీహార్: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన జాక్వలిన్ ఫెర్నాండస్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఈడీ అధికారుల విచారణకు హాజరై చిక్కుల్లో పడిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండస్ అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో అరెస్టు అయ్యి తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తో ఎందుకు సన్నిహితంగా ఉంది అనే విషయం గురించి ఓ సీనియర్ అధికారి బాంబు పేల్చారు. సుకేష్ చంద్రశేఖర్ నేరస్తుడు అని తెలిసినా అతనితో జాక్వలిన్ ఫెర్నాండస్ చాలా సన్నిహితంగా ఉందని ఆ సీనియర్ అధికారి అన్నారు. రూ. 215 కోట్ల అక్రమ లావాదేవీల వ్యవహారంలో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన జాక్వలిన్ ఫెర్నాండస్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసింది. ఈ కేసు విచారణ చేస్తున్న ఓ సీనియర్ అధికారి ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో జాక్వలిన్ ఫెర్నాండస్, ఆర్థిక నేరస్తుడు సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన వివరాలు చెప్పారని ఆ మీడియా తెలిపింది.

సుకేష్ చంద్రశేఖర్ అరెస్టు
ఇటీవల కాలంలో సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. సుకేష్ చంద్రశేఖర్ ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు తీహార్ సెంట్రల్ జైలుకు తరలించారు. సుకేష్ చంద్రశేఖర్ ఆర్థిక నేరాలకు పాల్పడి వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని కేసులు నమోదు అయ్యాయి.

జాక్వలిన్ మేడమ్ ఎంట్రీ
సుకేష్ చంద్రశేఖర్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుందని, రూ. 215 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడిందని బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండస్ మీద ఈడీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈడీ అధికారుల విచారణకు హాజరై చిక్కుల్లో పడిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండస్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

సుకేష్ తో జాక్వలిన్ కు లింక్
అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో అరెస్టు అయ్యి తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తో ఎందుకు సన్నిహితంగా ఉంది అనే విషయం గురించి కేసు విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి, ప్రత్యేక కమీషనర్ EOW రవీందర్ యాదవ్ బాంబు పేల్చారు. సుకేష్ చంద్రశేఖర్ నేరస్తుడు అని తెలిసినా అతనితో జాక్వలిన్ ఫెర్నాండస్ చాలా సన్నిహితంగా ఉందని ప్రత్యేక కమీషనర్ రవిందర్ యాదవ్ ఏఎన్ఐ మీడియా సంస్థకు చెప్పారు.

నేరస్తుడు అని తెలిసినా పెళ్లి చేసుకోవాలని ?
సుకేష్ చంద్రశేఖర్ నేరస్తుడు అని తెలిసినా అతనితో జాక్వలిన్ ఫెర్నాండస్ చాలా సన్నిహితంగా ఉందని, ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని ప్రత్యేక కమీషనర్ రవిందర్ యాదవ్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. రూ. 215 కోట్ల అక్రమ లావాదేవీల వ్యవహారంలో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన జాక్వలిన్ ఫెర్నాండస్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసింది.

జాక్వలిన్, సుకేష్ ఫోటోలు వైరల్
సుకేష్ చంద్రశేఖర్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన తరువాత కూడా జాక్వలిన్ ఫెర్నాండస్ అతనితో టచ్ లో ఉందని, ఆ విషయం ఇద్దరి మద్య సన్నిహిత సంబంధాలు అందరికి అర్థం అవుతోందని ప్రత్యేక కమీషనర్ రవిందర్ యాదవ్ ఏఎన్ఐ మీడియాకు చెప్పారు. సుకేష్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా ఉంటున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.

తీహార్ జైలుకు బాలీవుడ్ బ్యూటీలు
తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ను బాలీవుడ్ కు చెందిన నటీమనులు బిగ్ బాస్ ఫేమ్ నిక్కి తాంబోలి, ఛాహత్ ఖన్నా, సోఫియా సింగ, అరుషా పాటిల్ కలిశారని వెలుగు చూడటం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇదే కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నోరా ఫతేహి సుకేష్ చంద్రశేఖర్ ఆర్థిక నేరస్తుడు అని తెలిసిన తరువాత అతనికి దూరం అయ్యారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండస్ రూ. 215 కోట్ల వ్యవహారంతో సుకేష్ ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications