వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరం సంస్థలో ప్రమాద మృతులకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా, బిసిజి, రోటవైరస్ వ్యాక్సిన్లు దెబ్బతిన్నాయన్న పూనవల్లా

|
Google Oneindia TeluguNews

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సిఇఓ అదార్ పూనవల్లా, సీరం ఇన్స్టిట్యూట్ నూతనంగా నిర్మితమవుతున్న సెజ్ 3 భవనం లో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల షాక్ వ్యక్తం చేసిన ఆయన తాను మాట్లాడే మానసిక స్థితిలో లేనన్నారు.అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రతి రూ .25 లక్షల పరిహారాన్ని కంపెనీ నిబంధనల ప్రకారం తప్పనిసరి మొత్తానికి అదనంగా అందిస్తుందని పూనవల్లా చెప్పారు. బిసిజి, రోటవైరస్ వ్యాక్సిన్లు దెబ్బతిన్నాయని పూనవల్లా పేర్కొన్నారు .

Recommended Video

Biodiversity Flyover Accident CCTV Footage Exclusive Visuals || Oneindia Telugu

సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం (ఫోటోలు)

అత్యంత విషాదకరమైన రోజు: సీరం సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనవల్లా

అత్యంత విషాదకరమైన రోజు: సీరం సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనవల్లా

తరువాత ఫేస్బుక్ మరియు ట్విట్టర్లలో ఒక ప్రకటన విడుదల చేశారు. సీరం సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనవల్లా ఐదుగురు మృతి చెందిన ఘటనపై ఈరోజు సంస్థలో విషాదకరమైన రోజని, అత్యంత దుఃఖదాయకమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో లేని సీరం సంస్థ సీఈవో అదర్ పూనవల్లా గురువారం మధ్యాహ్నం సీరం ఇన్స్టిట్యూట్ యొక్క మంజ్రీ ప్లాంట్‌లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనాలలో ఈ ప్రమాదం జరిగిందని , భవనం యొక్క కొన్ని అంతస్తులు మంటల్లో ధ్వంసమయ్యాయని చెప్పారు.

నష్టం త్వరలో అంచనా వేస్తా .. ప్రమాదానికి కారణం తెలీదు : సైరస్ పూనవల్లా

నష్టం త్వరలో అంచనా వేస్తా .. ప్రమాదానికి కారణం తెలీదు : సైరస్ పూనవల్లా

అగ్నిప్రమాదానికి కారణం మాకు తెలియదని, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని, త్వరలో ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తామని సీరం సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సైరస్ పూనవల్లా స్పష్టం చేశారు.భారీ నష్టాలు మాట అటుంచి అగ్ని ప్రమాదం లో చోటుచేసుకున్న మరణాల దృష్ట్యా మానవ విషాదాన్ని తట్టుకోలేక పోతున్నామని, తీవ్ర ఆవేదనకు గురవుతున్నామని డాక్టర్ పూనవల్లాతో పాటు ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ ధేరే అన్నారు.

కోవిషీల్డ్ ఉత్పత్తిని ఈ ప్రమాదం ప్రభావితం చేయదన్న .. అదర్ పూనవల్లా

కోవిషీల్డ్ ఉత్పత్తిని ఈ ప్రమాదం ప్రభావితం చేయదన్న .. అదర్ పూనవల్లా

కోవిడ్ -19 కి వ్యాక్సిన్ అయిన కోవిషీల్డ్ ఉత్పత్తిని ఈ ప్రమాదం ప్రభావితం చేయదని అన్ని ప్రభుత్వాలు మరియు సాధారణ ప్రజలకు భరోసా ఇవ్వడానికి ట్విట్టర్ వేదికగా అదర్ పూనవల్లా ప్రయత్నించారు. ఇది మంజ్రీలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ క్యాంపస్‌లో కొత్త భవనం. ఇది పూర్తయ్యే దశలో ఉంది మరియు అదనపు పరిమాణంలో బిసిజి మరియు రోటవైరస్ వ్యాక్సిన్ల తయారీకి ఈ సౌకర్యం నిర్మించబడిందని ఆయన స్పష్టం చేశారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిన మంజ్రీ ప్లాంట్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిన మంజ్రీ ప్లాంట్

కోవిషీల్డ్ తయారవుతున్న హడాప్సర్‌లోని ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన ప్లాంట్ నుండి మంజ్రీ ప్లాంట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంటలు చెలరేగిన భవనం అదార్ పూనవల్లా యొక్క కొత్త కార్యాలయం మరియు బోర్డు గదికి దగ్గరగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా , పోలియో, డిఫ్తీరియా, టెటానస్ మరియు పెర్టుసిస్ కొరకు వ్యాక్సిన్ మోతాదులను తయారు చేస్తుంది. ప్రపంచంలోని 65 శాతం మంది పిల్లలు సీరం సంస్థ చేత తయారు చేయబడిన వ్యాక్సిన్‌ను అందుకున్నారని అంచనా.

English summary
Adar Poonawalla, CEO, SII, expressed shock over the loss of five lives in fire accident. Poonawalla said the company would provide compensation of Rs 25 lakh to the deceased and BCG and rotavirus vaccines and other products were damaged
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X