ఉన్నావో బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా... మంత్రులను గో బ్యాక్ అంటూ నినాదాలు
ఓ వైపు ఉన్నావో బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతుండగా యూపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈనేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం బాధితురాలికి న్యాయాన్ని పక్కన బెట్టి ఆమె కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రులు 25 లక్షలు ప్రకటించారు.
ఉన్నావో అత్యాచారం ,హత్య కేసులో బాధితురాలి కుటుంబానికి యూపీ ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు సాక్షీ మహారాజ్, స్వామీ ప్రసాద్‌లు ఈ పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు మంత్రులు బాధిత కుటుంబాన్ని పరమార్శంచికుండా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎట్టకేలకు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉన్నావో హత్యోదంతంపై యూపీతోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బాధితురాలికి కనీస రక్షణ కల్పించకుండా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఆమె ప్రాణాలను బలిగొంది. దీంతో కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధి బాధిత కుటంబాన్ని పరామర్శించింది. మరోవైపు పార్లమెంట్‌లో కూడ పెద్ద ఎత్తున ఉన్నావో సంఘటనపై చర్చ కూడ కొనసాగింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications