రూ.300 కోట్ల ఆస్తిపై కన్నేసింది.. సొంతమామనే లేపించేసింది..!
సొంతమామను చంపేందుకు కోటిరూపాయలు సుపారీగా ఇచ్చింది ఓ కోడలు.. అంతమొత్తంలో సుపారీ ఇచ్చి మరీ మామను చంపించడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ పెద్దాయన పేరుమీద ఏకంగా 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే, అప్పటికే సమాజంలో తనకంటూ ఒక స్టేటస్ మెయింటెన్ చేస్తున్న సదరు కోడలు మామ పేరున ఉన్న ఆస్తిని కొట్టేయాలని స్కెచ్ వేసి మరీ మామను లేపించేసింది. ఈ క్రైమ్ స్టోరీలో తర్వాత ఏం జరిగిందంటే...
నాగ్‌పూర్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలను పరిశీలిస్తే..నాగ్‌పూర్‌కు చెందిన అర్చన మనీశ్ పుట్టెవార్(53) ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తుంది. వైద్యుడైన తన భర్త మనీష్‌కు వృద్యాప్యంలో ఉన్నతల్లిదండ్రులు పురుషోత్తం పుట్టేవార్ (82), శకుంతలలు ఉన్నారు. ఇటీవల కాలంలో అర్చన అత్త తీవ్ర అనారోగ్యంతో భాదపడుతోంది. అయితే, అత్తమామల పేరుమీద రూ. 300 కోట్ల వరకు ఆస్తి ఉందని తెలుసుకున్న అర్చన, అత్త ఎలాగో అనారోగ్యంతో చనిపోతుందని, మామ మాత్రం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఫిక్సయ్యింది. దీంతో మామ పురుషోత్తంను అడ్డు తొలగిస్తే ఆస్తి మొత్తం తమ సొంతమవుతుందని పథకం రచించింది.

లోతైన దర్యాప్తులో...
అనుకున్న ప్రకారం మామ హత్యకు తన భర్త వద్ద డ్రైవర్‌గా పని చేసే బగ్డేను ఎంచుకుంది. అతన్ని ఒప్పించి బగ్డే స్నేహితులైన నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌కు పురుషోత్తం హత్యకు సంబంధించిన సుపారీని అందించింది. 15 రోజుల క్రితం ఆసుపత్రిలో ఉన్న తన భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటకు వస్తుండగా పథకం ప్రకారం బగ్డే, అతడి మిత్రులు కారుతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే పురుషోత్తం ప్రాణాలు విడిచాడు. అయితే, పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తూ జరిగినది కాదని అనుమానించి, లోతైన విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో పురుషోత్తం కోడలు కుట్రకోణం వెలుగుచూసింది. దీంతో అర్చనతో పాటు హత్యకు పాల్పడ్డ మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications