ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 332 కోట్లు హుష్ కాకి, ఊపేస్తున్న అక్కచెల్లెళ్లు !
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకాన్ని అమలు చేయడంతో కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే మహిళల సంఖ్య విపరీతంగా పెరిగింది.
మహిళా ప్రయాణికులపై నిఘా ఉంచిన రవాణాశాఖ అధికారులు టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని పట్టుకుని జరిమానాలు విధిస్తున్నారు. ఆగస్టు నెలలో కేఎస్ఆర్ టీసీ అధికారులు 3,208 టికెట్ లేని ప్రయాణికులకు జరిమానా విధించింది. టిక్కెట్ లేని ప్రయాణికుల సంఖ్య ప్రతినిత్యం పెరుగుతుండడంతో రవాణా శాఖ దర్యాప్తు బృందాలు తనిఖీలు ముమ్మరం చేసింది.

కార్పొరేషన్ పరిధిలో తిరుగుతున్న 44, 416 వాహనాలపై అధికారులు విచారణ చేపట్టారు. వీరిలో 3,208 మంది ప్రయాణికుల నుంచి రూ.4, 70,801 జరిమానా వసూలు చేశారు. కేఎస్ఆర్ టీసీలోని కొందరు ఉద్యోగు కారణం సంస్థకు నష్టం వస్తోందని అధికారులు గుర్తించారు. బాధ్యులపై శాఖాపరమైన తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
కేఎస్ ఆర్ టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ పొందాలని కేఎస్ఆర్ టీసీ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం ప్రవేశపెట్టి మూడు నెలలు పూర్తి అయ్యింది. ఇప్పటివరకు 13. 20 కోట్ల మంది మహిళలు కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సుల్లో జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారని అధికారులు అంటున్నారు.
జీరో టికెట్ లపై మహిళలు ఉచితంగా ప్రయాణించడంతో మొత్తం రూ. 332.77 కోట్లు ఖర్చు అయ్యిందని అధికారులు అంటున్నారు. వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ పరిధిలోని ధారవాడ, బెళగావి, బాగల్‌కోట్, గదగ్, హావేరి, ఉత్తర కన్నడ జిల్లాల్లోని 9 రవాణా విభాగాల్లో మూడు నెలల వ్యవధిలో 13,20,53,266 మంది మహిళలకు జీరో టిక్కెట్‌లను జారీ చేశారు.

ఇంత మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడంతో ఉచిత ప్రయాణ టిక్కెట్ ప్రయాణం ఖర్చు రూ. 332, 77, 03, 789 అయ్యిందని సంబంధిత అధికారులు అంటున్నారు. జూన్ 11 నుంచి 30 వరకు 2. 55 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారు. ప్రయాణ టిక్కెట్ మొత్తం రూ. 65.15 కోట్లు అయ్యింది. జూలై నెలలో 4. 48 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారు.
ప్రయాణ టిక్కెట్ మొత్తం రూ. 111.78 కోట్లు అయ్యింది. ఆగస్టు నెలలో 4.61 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారు. ప్రయాణ టిక్కెట్ మొత్తం రూ. 115.42 కోట్లు అయ్యింది. సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు 1. 56 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్లు పొంది ఉచితంగా ప్రయాణించారు. ప్రయాణ టిక్కెట్ మొత్తం రూ. 40.42 కోట్లు అయ్యిందని సంబంధిత అధికారులు అంటున్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications