రూ. 34 వేల కోట్ల స్కాం: డీహెచ్ఎఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ అరెస్ట్

న్యూఢిల్లీ: రూ. 34,000 కోట్ల మోసం కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (CBI) మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరు పర్చగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పలు బ్యాంకులకు రూ. 34,000 కోట్ల మోసం కేసులో గతంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు.

అయితే, 2022, డిసెంబర్‌లో డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. సీబీఐ ఛార్జీషీట్ అసంపూర్తి ఉందన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. తాజాగా, ధీరజ్ వాధ్వాన్ ను సీబీఐ ముంబైలో అరెస్ట్ చేసింది. అనంతరం ఢిల్లీ కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Rs 34000 crore DHFL bank fraud CBI arrests Dheeraj Wadhawan

కాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుపై 2022, జూన్‌లో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ధీరజ్‌ను అరెస్ట్ చేసింది. నిధులను స్వాహా చేసేందుకు అనేక షెల్ కంపెనీలను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేగాక, లావాదేవీలను దాచడానికి పుస్తకాలను తప్పుగా మార్చినట్లుగా గుర్తించారు. తాజాగా ధీరజ్, అతని సోదరులకు లభించిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కావడంతో వారిని సీబీఐ అరెస్ట్ చేసింది. 2023, డిసెంబర్ 8న యెస్ బ్యాంక్ కేసులో ఆరోగ్య కారణాలతో ధీరజ్ మధ్యంతర బెయిల్ పొందారు. బాంబే హైకోర్టు ఈ మధ్యంతర బెయిల్‌ను మే 2న సాధారణ బెయిల్‌గా మార్చింది. ఆ తర్వాత తాజాగా ఆయనను అరెస్ట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+