రూ.618 కోట్లు.. రెండునెలల కరెంట్ బిల్లు... మోడీ ఇలాకాలో ఘటన
వారణాసి : ఒకటి కాదు రెండు కాదు .. రూ. 618 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. అదీ కూడా ఓ ప్రభుత్వ పాఠశాలకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు నెలల్లో ఆ పాఠశాల వాడిన బిల్లు మొత్తం రూ.618 కోట్ల అట. యూపీ విద్యుత్ అధికారుల తీరు ఇలా ఉంది. ఈ విషయం తెలిసి పాఠశాల ప్రిన్సిపాల్ షాక్‌నకు గురయ్యారు. తమ స్కూల్ కెంటి ఇంత బిల్లు రావడం ఏంటీ అని ఆశ్చర్యపోయారు. ఈ పాఠశాల సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గంలో ఉండటం విశేషం.
యూపీలోని వారణాసిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఈ స్కూల్ ఉంది. అయితే ఈ పాఠశాలకు రెండునెలల పవర్ బిల్‌ను ఇటీవల విద్యుత్ సిబ్బంది ఇచ్చారు. ఆ బిల్లు చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోరేళ్ల బెట్టాడు. అవును ఆ స్కూల్‌కు వచ్చిన కరెంట్ బిల్లు రూ.618 కోట్లు. దీనిపై పాఠశాల సిబ్బంది విద్యుత్ శాఖ అధికారులను కూడా సంప్రదించారు. ఎక్కడ ఏదైనా లోపం జరిగిందా ? అని ఆరాతీశారు. కానీ ఎక్కడ ఏ లోపం జరగలేదని .. రూ.618 కోట్లు కట్టాల్సిందేనని స్పష్టంచేశారు. అంతేకాదు ఈ నెల 7 లోపు బిల్లు కట్టాలని హుకుం జారీచేశారు. లేదంటే పాఠశాలకు కరెంట్ కట్ చేస్తామని పేర్కొన్నారు.

యూపీలో మంగళవారం నుంచే కరెంట్ చార్జీలు పెంచారు. ఈ క్రమంలోనే పాఠశాలకు కూడా దిమ్మతిరిగే పవర్ బిల్ వచ్చింది. అర్బన్ డొమెస్టిక్, కమర్షియల్ కరెంట్ చార్జీ ధరలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత మేర పెంచారు. పట్టణాల్లో 12 శాతం కరెంట్ చార్జీలు పెరిగాయి. అందులో ఇండస్ట్రీకి సంబంధించి 12 శాతం ధరలు పెంచారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ బిల్లు కనీసం రూ.400 నుంచి రూ.500కు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రెండేళ్ల క్రితం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 12.73 శాతం పవర్ బిల్లు పెంచుతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పవర్ బిల్లు పెంచింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications