రూ. 7 కోట్ల భూమిని ప్రభుత్వ స్కూల్‌కు విరాళంగా ఇచ్చిన మహిళ...
7 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఓ ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చేసింది ఓ మహిళ. అందుకు గాను ఆ మహిళను సత్కరించనున్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరో తెలుసుకుందాం పదండి..
తమిళనాడులోని మధురైకి చెందిన అమ్మాళ్ అనే మహిళ రూ.7 కోట్ల విలువైన ఎకరం భూమిని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చేసిందీ. దీంతో ఈ మహిళ వార్తల్లో నిలిచింది. గవర్నమెంట్ స్కూల్‌ను విస్తరించేందుకు భూమి కావాల్సి ఉండగా, అమ్మాళ్ అనే మహిళ తన ఎకరం భూమిని ఇచ్చేసింది. ఈ మహిళ చేసిన దాతృత్వానికి తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా సంతరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.

ఈ నెల 26న అమ్మాళ్‌కు అవార్డు ప్రదానం..:
అమ్మాళ్ పూర్తిపేరు ఆయిపురాణం అమ్మాళ్. ఈ మహిళ స్థానిక బ్యాంకులో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే అమ్మాళ్‌కు ఒట్టకడై సమీపంలో ఎకరం భూమి ఉంది. ఆ భూమి విలువ 7 కోట్ల రూపాయలు. అయితే, అక్కడ ఉన్న పాఠశాల విస్తరణ కోసం కొంత భూమి కావాల్సి వచ్చింది. దాంతో అమ్మాళ్ తనపేరు మీదున్న ఆ భూమిని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చేసింది. రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లి తన భూమిని ప్రభుత్వం పేరుమీదకి రిజిస్ట్రేషన్ చేసేసింది. ఆ తర్వాత ఆ భూమి పత్రాలను ఆ రాష్ట్ర విద్యాశాఖా అధికారులకు అందజేసింది. ఈ విషయం తెలుసుకున్న చాలామంది ప్రముఖులు ఆయిపురాణం అమ్మాళ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా అమ్మాళ్‌ను ప్రశంసించడం జరిగింది. ఈ మహిళ చేసిన దాతృత్వానికి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే అవార్డుల్లో ఈమె పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 వ తేదీన ఆమెకు అవార్డు ఇవ్వనున్నట్లు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. విద్య అనేది అక్షర సంపద అని, అమ్మాళ్ చేసిన విరాళం వేలాది మంది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని అమ్మాళ్ పేర్కొన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications