హీరో అజయ్ దేవ్‌గన్ సభలో ఉద్రిక్తత: లాఠీఛార్జి

పాట్నా: బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఏ ఎన్నికల ర్యాలీలో హింస చోటు చేసుకుంది. నలందలోని ఎన్టీఏ నిర్వహిస్తోన్న ర్యాలీపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరుపున బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

నలంద జిల్లాలోని బిహార్‌ షరీఫ్‌ పట్టణంలో అజయ్‌ భాజపా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఉదయం పదిన్నర గంటలకు రావాల్సిన అజయ్‌ మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చారు. దాంతో అసహనానికి గురైన ప్రజలు ఆందోళనకు దిగారు. కుర్చీలను విరగొట్టి విధ్వంసానికి దిగారు.

Ruckus at BJP's rally in Bihar Sharif

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీలకు పనిచెప్పారు. అంతకు ముందు లఖిసరాయ్‌, ఖగరియాల్లోనూ అజయ్‌ సభలకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

లాఠీ ఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీహార్ ఎన్నికల్లో తొలిదశలో భాగంగా సోమావరం 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 57 శాతం ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక రెండో దశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 16న జరగనుంది. నవంబర్ 8న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+