Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా దేశానికి రండి: ప్రధాని మోడీకి రష్యా, ఉక్రెయిన్ దేశాధ్యక్షులు పుతిన్, జెలెన్‌స్కీ ఆహ్వానం

న్యూఢిల్లీ: భారతదేశంలో జరగనున్న లోక్‌​సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానించారు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం తెలిపారు. కాగా, బుధవారం పుతిన్​, జెలెన్​ స్కీతో ప్రధాని మోడీ ఫోన్​లో వేర్వేరుగా మాట్లాడారు. ఆ సమయంలో ఇరువురు అధ్యక్షులు మోడీని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఐదోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్‌​కు విషెస్​ చెప్పారు మోడీ. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలే మార్గమని స్పష్టం చేశారు.

Russia and Ukraine presidents Putin and Zelenskyy have invited pm modi to visit their countries

భారత్‌-రష్యా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు అంగీకరించామని మోడీ తెలిపారు. ఉక్రెయిన్‌ చుట్టూ నెలకొన్న పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా సుదీర్ఘంగా పుతిన్, మోడీ చర్చించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇదే అంశంపై అటు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ కూడా స్పందించింది. మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొంటూ.. మోడీకి శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించింది.

అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ఫోన్ మాట్లాడారు ప్రధాని మోడీ. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభానికి సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కోసం భారత్‌ అన్నివిధాలా కృషి చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. ఇదే సమయంలో మనవతా సహాయాన్ని భారత్‌ కొనసాగిస్తుందన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో సంభాషించిన మోడీ.. సంప్రదింపులు, దౌత్యమార్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ చెప్పినట్లు పేర్కొన్నారు.

మరోవైపు, ఉక్రెయిన్‌కు భారత్‌ అందిస్తున్న మానవతా సాయాన్ని జెలెన్‌స్కీ ప్రశంసించారు. వివిధ అంశాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోడీని ఉక్రెయిన్ ఆహ్వానించారు జెలెన్‌స్కీ. కాగా, ఇలా ఒకేరోజు రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో మోడీ సంభాషించడం విశేషం. ఇది ఇలావుండగా, ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ.. భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+