Russia-Ukraine: భారతీయుల భద్రతే ముఖ్యం, సురక్షితంగా స్వదేశానికి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్న క్రమంలో అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే వెయ్యి మందికిపైగా విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తదితరులు పాల్గొన్నారు.
'ఉక్రెయిన్ రష్యా వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశం 2 గంటలకుపైగా కొనసాగింది. ప్రధానమంత్రి భద్రత, భారతీయ విద్యార్థుల తరలింపును అత్యంత ప్రాధాన్యతగా నిర్ధారించారు. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు తరలింపును వేగవంతం చేయడానికి మరింత సహకారం మెరుగుపరచబడుతుంది' ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులందరినీ తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని ప్రధాని మోడీ ఇప్పటికే చెప్పారు. విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా శనివారం మీడియా సమావేశంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి 'ఆపరేషన్ గంగా' కింద భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు.
ఉక్రెయిన్‌లోని భారతీయులకు మరింత సహాయం చేయడానికి, ప్రత్యేక ట్విట్టర్ హ్యాండిల్‌ను ఏర్పాటు చేసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
రొమేనియా, హంగేరీల నుంచి వేలాది మంది భారతీయులను తరలించామని, ఉక్రెయిన్ నుంచి భూ మార్గాల ద్వారా మరో వెయ్యి మందిని తరలించామని విదేశాంగ కార్యదర్శి తెలిపారు.
గురువారం న్యూఢిల్లీలో భద్రతపై కేబినెట్ కమిటీ (సిసిఎస్) సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. భారత పౌరుల రక్షణ, భద్రతే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అని ప్రధాని మోడీ సమావేశంలో అన్నారు.
#WATCH | PM Narendra Modi chairs a high-level meeting on the Ukraine issue. pic.twitter.com/eJELxgnqmO
— ANI (@ANI) February 27, 2022
ఉక్రెయిన్ నుంచి మొత్తం 469 మంది భారతీయులు ఖాళీ చేయబడ్డారు, వారిలో 250 మంది ఆదివారం ఉదయం ఢిల్లీలో, 219 మంది శనివారం సాయంత్రం ముంబైలో ల్యాండ్ అయ్యారు.
కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉదయం డాన్‌బాస్ ప్రాంతంలోని ప్రజలను "రక్షించడానికి" ప్రత్యేక సైనిక కార్యకలాపాలను ప్రారంభించినట్లు చెప్పారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య చర్చలకు పుతిన్ ఆహ్వానించడంతో ఉక్రెయిన్ కూడా ఇందుకు అంగీకరించింది. బెలారస్‍లో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు సోమవారం చర్చలు జరపనున్నారు.












Click it and Unblock the Notifications