Russia Ukraine crisis : ప్రధాని మోడీ అత్యన్నతస్ధాయి భేటీ-ఏం చేద్దామని ప్రశ్న ?
ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్ ను సైతం ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ కు చిరకాల మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ పై కాలు దువ్వడం, ఉక్రెయిన్ భారత్ శరణు కోరడం, మరోవైపు భారత్ కు మిత్రదేశలైన అమెరికా, బ్రిటన్ తో పాటు నాటో దేశాలు రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగేందుకు సిద్ధపడుతుండటం వంటి పరిణామాలు కేంద్రాన్ని కలవరపెడుతున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో తలెత్తిన పరిస్దితుల నేపథ్యంలో భారత్ ఆచితూచి స్పందిస్తోంది. అలాగే అక్కడి పరిస్ధితులపై ప్రధాని మోడీ ఇవాళ అత్యున్నత స్ధాయి భేటీ నిర్వహిస్తున్నారు. రష్యా బారి నుంచి ఉక్రెయిన్ ను కాపాడేందుకు భారత్ రంగంలోకి దిగాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వైఖరి ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికే తాము తటస్ధంగా ఉంటామని కేంద్రమంత్రి రంజిత్ సింగ్ ప్రకటించారు. దీంతో రష్యా-ఉక్రెయిన్ పోరుపై అనుసరించాల్సిన వైఖరిపై ప్రధాని మోడీ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, ఇతర మంత్రులు, నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రష్యా యుద్ధానికి దిగిన ఉక్రెయిన్ లో వేల సంఖ్యలో భారతీయులు, విద్యార్ధులు చిక్కుకోవడం కేంద్రాన్ని కలవరపెడుతోంది. ఇప్పుడు కేంద్రం స్పందించకపోతే వారిలో చాలా మంది యుద్ధానికి బలయ్యే అవకాశాలూ లేకపోలేదు. అది జరిగితే కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తడం ఖాయం.అందుకే వారిని రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ ప్రధానంగా విదేశాంగశాఖతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అంతర్జాతీయంగా కూడా రష్యా-ఉక్రెయిన్ పోరుపై ప్రపంచ దేశాలు ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో భారత్ కూడా తన వైఖరి స్పష్టం చేయాల్సిన పరిస్దితులు ఎదురుకావొచ్చని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications