నిద్రిస్తున్న రష్యా యువతిని రేప్ చేసిన గెస్ట్‌హౌస్ ఓనర్
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. గోవా అందాలను సందర్శించడానికి వచ్చిన ఓ రష్యన్ యువతిపై అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే... గోవా విహారయాత్రకు వచ్చిన రష్యా యువతి బస చేసిన గెస్ట్ హౌస్ ఓనరే ఆమెపై ఆత్యాచారానికి పాల్పడ్డాడు.
గెస్ట్ హౌస్‌లో అద్దెకు తీసుకున్న గదిలో ఆమె నిద్రిస్తుండగా గమనించిన గెస్ట్‌హౌస్ ఓనర్ శుక్రవారం ఉదయం ఆమెపై ఈ దారుణానికి పాల్పడినట్టు పెర్నెమ్ ఇన్ స్పెక్టర్ సంజయ్ దాల్వి చెప్పారు. దీంతో తాను నిద్రిస్తుండగా తనపై గెస్ట హౌస్ ఓనర్ అత్యాచారానికి పాల్పడినట్టు సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఈ దారుణం గోవాలోని మోర్జిమ్ గెస్ట్‌హౌస్‌లో చోటు చేసుకుంది. గెస్ట్‌హౌస్ ఓనర్ జేమ్స్ డిసౌజాను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వైద్య పరీక్షల్లో సదరు యువతి రేప్‌కు గురైనట్లు నిర్ధారణ జరిగిందని ఇన్ స్పెక్టర్ సంజయ్ దాల్వి తెలిపారు. బాధితురాలు మే మొదటి వారంలో తన దేశానికి తిరిగి వెళ్లాల్సి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications