Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarimala: అయ్యప్ప దర్శనం, మహిళలకు గుడ్ న్యూస్, టికెట్ బుకింగ్ కు గ్రీన్ సిగ్నల్, ఎవరైనా, ఎప్పుడైనా ఓకే!

శబరిమల/ కొచ్చి/ న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి మహిళలకు విధించిన నిషేధాన్ని పూర్తిగా తొలగించారు. శబరిమలకు వెళ్లే మహిళలు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇంతకాలం ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. శబరిమల ఆన్ లైన్ పోర్టల్ లో ఇంతకాలం 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న మహిళలు శబరిమలకు వెళ్లడానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే పోర్టల్ లో మార్పులు చెయ్యడంతో శబరిమలకు వెళ్లే మహిళలు ఇప్పుడు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే!

సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే!

కేరళలోని శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి మహిళలకు అవకాశం లేదని చాలా మంది అయ్యప్ప భక్తులు వాదించారు. చివరికి ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి లింగభేదం లేదని, అయ్యప్పను దర్శించుకోవడానికి అందరూ సమానమే అని, మహిళలు కూడా శబరిమలకు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

కరోనా కారణంతో చెక్

కరోనా కారణంతో చెక్

ప్రస్తుతం శబరిమలకు వెళ్లడానికి అయ్యప్పస్వామి భక్తులకే అనేక నియమాలు ఉన్నాయి. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి కారణంగా శబరిమలకు వెళ్లడానికి కేరళ ప్రభుత్వం అయ్యప్పమాల వేసుకున్న భక్తులకు అనేక నియమాలు పెట్టింది. ఇదే సమయంలో శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి మహిళలకు అవకాశం ఇవ్వలేదు.

దేవస్వం బోర్డు, పోలీసులు

దేవస్వం బోర్డు, పోలీసులు

శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు టిక్కెట్లు బుక్ చేసుకునే పోర్టల్ ను ట్రావెంకోర్ దేవస్వం బోర్డు, కేరళ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను కేరళ ప్రభుత్వం చాలా తక్కువగా పరిమితం చేసింది. ఇలాంటి సందర్బంలో 50 ఏళ్ల తక్కువ కంటే వయసు ఉన్న మహిళలు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.

కేరళ ప్రభుత్వం అలర్ట్

కేరళ ప్రభుత్వం అలర్ట్

మహిళలు శబరిమలకు వెళ్లడానికి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతోందని అనేక విమర్శలు వచ్చాయి. శబరిమలకు వెళ్లే భక్తులు ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకునే పోర్టల్ ను ట్రావెన్ కోర్ బోర్డు, పోలీసులు నిర్వహించడంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

Recommended Video

    #SabarimalaTemple: కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి !
    ఆల్ ఇన్ వన్...... స్వామియేశరణమయ్యప్ప

    ఆల్ ఇన్ వన్...... స్వామియేశరణమయ్యప్ప

    శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ రెండు వేల మంది, శనివారం, ఆదివారం రోజుల్లో మూడు వేల మందికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇదే సమయంలో అయ్యప్ప భక్తులతో పాటు అన్ని వయసుల మహిళలు వెళ్లడానికి, వారు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మొత్తం మీద ఇంతకాలం ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడిన మహిళా భక్తులు ఇప్పుడు శబరిమలకు వెళ్లడనికి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+