జ్యోతి దర్శనానికి లక్షలమంది: కొండపైకి భక్తులకు నో ఎంట్రీ
శబరిమల అయ్యప్ప ఆలయంలో నేడు మకర సంక్రాంతి పూజ, జ్యోతి దర్శనం అత్యంత వైభవంగా జరుగనుంది. దీనికోసం లక్షలాది మంది భక్తులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ విశేష జ్యోతి దర్శనంతో మండల-మకరవిళక్కు వార్షిక యాత్రకు తెరపడనుంది. దీనికి ముగింపు ఘట్టం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భక్తుల రాక, తిరువాభరణాల ఊరేగింపు వంటి కార్యక్రమాలపై ట్రావెన్ కూర్ దేవస్వొం బోర్డు ఏర్పాట్లు చేసింది.
నేటి మకర సంక్రాంతి పూజ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు తిరువాభరణాల ఊరేగింపు జ్యోతిమేడుకు చేరుకుంటుంది. దేవస్థానం అధికారులు, తంత్రి వీటిని స్వీకరిస్తారు. అనంతరం అవి సన్నిధానానికి చేరుకుంటాయి. ప్రధాన ఆభరణాల పెట్టెను తిరుముట్టంలో, మిగిలినవి మాలికాపురానికి తరలిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు తిరువాభరణాల ప్రదర్శన, దీపారాధన జరుగుతాయి. అదే సమయంలో, పొన్నంబలమేడులో పవిత్ర మకరజ్యోతి దర్శనమిస్తుంది.

మంగళవారం సాయంత్రం.. తంత్రి కందరారు మహేష్ మోహనరారు పర్యవేక్షణలో సన్నిధానంలో విగ్రహ శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. పంపా నది వద్ద అయ్యప్ప స్వామికి పంపా సద్య సమర్పించారు. ప్రత్యేక హారతి ఇచ్చారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు అనంతరం కొండపైకి చేరుకున్నారు. జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులతో శబరిమల రహదారులు క్రిక్కిరిసిపోయాయి. దీంతో రద్దీని నివారించడానికి, ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండటానికి అధికారులు కఠిన ఆంక్షలు విధించారు.
ఉదయం 11 గంటల నుంచి పంపా నుండి శబరిమలపైకి భక్తులకు ప్రవేశం లేదు. నీలక్కల్-పంపా మార్గం ఉదయం 10 గంటల నుంచి వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసివేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలపై భక్తుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ముందుకు కదలడానికి గంటల కొద్దీ సమయం పడుతోండటంతో అసహనానికి గురయ్యారు. రద్దీ నియంత్రణకు పోలీసులు కట్టిన తాళ్లు, ఇతర బ్యారికేడ్లను దాటుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. రద్దీ నేపథ్యంలో అటు వర్చువల్ క్యూ బుకింగ్‌లను 30,000కు పరిమితం చేశారు.
భక్తుల భద్రత దృష్ట్యా మకరజ్యోతి వీక్షణ ప్రాంతాల చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. మకరవిళక్కు పండుగ సందర్భంగా బుధవారం పతనంతిట్ట జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భక్తుల తిరుగు ప్రయాణం కోసం కేరళ రోడ్డు రవాణా సంస్థ తొలిసారిగా పంబాలో 1,000 బస్సులను అందుబాటులో ఉంచింది. మకరజ్యోతి దర్శనానంతరం ఈ బస్సులు నీలక్కల్, ఇతర గమ్యస్థానాలకు భక్తులను చేరవేస్తాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications