వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరచుకున్న శబరిమల అయ్యప్ప కోవెల: భక్తుల తాకిడి, వివాదాస్పద ఆదేశాలు విత్‌డ్రా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తెరుచుకోవడంతో భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. మండలం-మకరవిలక్కు వార్షిక యాత్ర సీజనులో భాగంగా ప్రధాన అర్చకులు ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి ఆధ్వర్యంలో ఆలయం ద్వారాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు.

శబరిమల అయ్యప్ప భక్తుల సంఖ్యపై పరిమితి లేదు

శబరిమల అయ్యప్ప భక్తుల సంఖ్యపై పరిమితి లేదు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రోజుకు 30వేల మంది భక్తులనే అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది మాత్రం అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాగా, తొలి రోజు 30వేల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే అనందగోపన్ తెలిపారు. కాగా, గత రెండేళ్లుగా ఆంక్షలు ఉండటంతో ఈసారి స్వామి వారిని దర్శించుకునే భక్తులు సంఖ్య 40-50 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివాదాస్పద ఆదేశాలను ఉపసంహరించుకున్న కేరళ సర్కారు

వివాదాస్పద ఆదేశాలను ఉపసంహరించుకున్న కేరళ సర్కారు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులందరినీ
అనుమతించాలంటూ పోలీసు సిబ్బందికి హోం శాఖ జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను కేరళ ప్రభుత్వం గురువారం ఉపసంహరించుకుంది. బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

తమకు ఎలాంటి దురుద్దేశం లేదన్న కేరళ సర్కారు

తమకు ఎలాంటి దురుద్దేశం లేదన్న కేరళ సర్కారు

2018 సెప్టెంబరు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొండ గుడి, దాని ప్రాంగణంలో విధుల్లో ఉన్న పోలీసులకుహోం శాఖ పంపిణీ చేసిన హ్యాండ్‌బుక్‌లో యాత్రికులందరికీ ఆలయంలోకి ప్రవేశిం చడానికి అనుమతి ఉంది. భక్తుల ప్రవేశంపై శబరిమల ఆలయంలో విధుల్లో ఉన్న సిబ్బం దికి పంపిణీ చేసిన పోలీసు హ్యాండ్ బుక్‌లోని ఆదేశాలపై బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కేరళ ప్రభుత్వం ఈ పోలీస్ హ్యాండ్ బుక్ రూల్స్‌ ఆదేశాలను ఉపసంహరించుకుంది. పొరపాటు జరిగిందని, దురుద్దేశం లేదని రాష్ట్ర దేవస్వామ్ మంత్రి రాధాకృష్ణ స్పష్టం చేశారు. మంచి ఉద్దేశంతోనే తాము ఈ రూల్స్ బుక్ తీసుకొచ్చామని వెల్లడించారు.

English summary
Sabarimala Temple opened: Govt withdraws controversial directive allowing entry to all pilgrims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X