యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలోకి ‘హోయసల’ ఆలయాలు
న్యూఢిల్లీ: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశంలోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని హోయసల ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో(UNESCO) తాజాగా వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హలేబీడ్, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్ కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలకు ప్రపంచ వారసత్వ కట్టడాల చోటు లభించడం విశేషం.

హోయసలకు ఈ గౌరవం దక్కడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో హోయసలకు చోటు లభించడం భారత్ కు ఎంతో గర్వకరణమని అన్నారు. ఆలయాలపై చెక్కిన సమాచారం, అద్భుతమైన శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళానైపుణ్యానికి నిదర్శనం అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
More pride for India!
— Narendra Modi (@narendramodi) September 18, 2023
The magnificent Sacred Ensembles of the Hoysalas have been inscribed on the @UNESCO World Heritage List. The timeless beauty and intricate details of the Hoysala temples are a testament to India's rich cultural heritage and the exceptional craftsmanship of… https://t.co/cOQ0pjGTjx
హోయసల పవిత్ర ఆలయాలు 2014, ఏప్రిల్ 15 నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజిక్ సర్వే ఆప్ ఇండియా నిర్వర్తిస్తోంది. కాగా, తెలంగాణలోని రామప్ప ఆలయానికి గత కొంత కాలం క్రితమే యునెస్కో గర్తింపు వచ్చిన విషయం తెలిసిందే.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications