తనకు ఓటు వేయలేదని మతం మారతానన్నాడు!
బిజ్నోర్: తన మతం వారి ఓట్లను నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి పాలయ్యాడు. దీంతో ఆగ్రహించిన ఆ అభ్యర్థి మొత్తం తన కుటుంబం అంతా ఇస్లాం మతంలోకి మారిపోతామని ప్రకటించాడు. ఈ వార్త విని గ్రామస్థులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లోచోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. బిజ్నోర్ ప్రాంతానికి చెందిన హర్‌పాల్‌సింగ్ ఇటీవల జరిగిన స్థానిక గ్రామ ప్రధాన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ గ్రామంలో ఉన్న 1300 ఓటర్లలో 800 మంది ముస్లింలు, 500 మంది హిందువుల ఓటర్లు ఉన్నారు.

ఎన్నికలకు ముందు హిందువులంతా హర్‌పాల్‌సింగ్‌కే ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. తీరా ఫలితాలు చూస్తే ఎక్కువ ఓట్లు మరో అభ్యర్థికే పడ్డాయి.
మాటిచ్చి మోసం చేశారన్న కోపంతో హర్‌పాల్‌సింగ్ తన 13మంది కుటుంబసభ్యులతో త్వరలో ఇస్లాం మతంలోకి మారుతున్నట్లు ప్రకటించాడు. తన మతం అని నమ్మినందుకు లాభం లేనప్పుడు తనకు మాత్రం ఆ మతం ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తుండటం గమనార్హం.
.












Click it and Unblock the Notifications