వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ్జీ వాసుదేవ్ 30 వేల కిలోమీట‌ర్ల బైక్ జ‌ర్నీ- లక్ష్యం ఇదే : ఒంటరిగా ప్రపంచ వ్యాప్తంగా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

జగ్గీ వాసుదేవ్ ఒక చారిత్రక పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మిక గురువగా.. పర్యావరణ వేత్తగా ఉన్న జగ్గీ వాసుదేవ్ ఏకంగా వేల కిలోమీటర్లు బైక్ జర్నీ ప్రారంభించారు. మొత్తంగా 100 రోజుల పాటుగా ఈ జర్నీ కొనసాగనుంది. లండన్ టు ఢిల్లీ ఈ యాత్ర టూర్ ఖరారు చేసారు. లండన్‌లోని ట్రాఫల్‌గర్ స్క్వేర్ నుంచి ఈ బైక్ జర్నీని ప్రారంభించారు. ఈ ప్రయాణం 27 దేశాల మీదుగా 30 వేల కిలో మీటర్లు సాగనుంది. ఈ యాత్ర ప్రధాన లక్ష్యం సేవ్ సాయిల్ మూమెంట్. భూసారం నాణ్యతను కోల్పోయి నిస్సారంగా ఎడారిగా మారకుండా కాపాడుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ సేవ్ సాయిల్ పేరిట ఉద్యమాన్ని మొదులు పెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా దీనిపై అవగాహన తీసుకురావాలని ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా పలువురు ప్రపంచ నేతలతో పాటుగా పర్యావరణ నిపుణులను కలుసుకుంటారు. భూమిని రక్షించుకొనే చర్యల పైన వారితో చర్చలు చేయనున్నారు. యునైటెడ్ నేషన్స్ కాన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ ప్రకారం, 90 శాతం భూమి 2050 కల్లా నిస్సారంగా మారుతుందనే హెచ్చరిలు ఉన్నాయి. దీంతో...అదే జరిగితే ఆహారం - నీటి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. కరువు - కాటకాలు సంభవించే ప్రమాదం పొంచి ఉంది. ఇది మొత్తంగా మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.

Sadhgurus Save Soil awareness campaign across Europe and the Middle East en route to India

దీంతో..జగ్గీ వాసుదేవ్ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. జగ్గీ వాసుదేవ్ చేస్తున్న ఈ ఉద్యమంలో ఇప్పటికే ఆరు కరేబియన్ దేశాలు భాగస్వామ్యం తీసుకున్నాయి. ఈ ఒప్పందంలో దేశాలు.. ఆంటిగ్వా అండ్ బార్బుడా, డొమినికా, సెయింట్ లూసియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, గయానా, బార్బడోస్ లు చేరాయి.

Sadhgurus Save Soil awareness campaign across Europe and the Middle East en route to India

ఆయా దేశాలు నాయ‌కులు స‌ద్గురుతో ప్రారంభించిన సేవ్ సాయిల్ మూమెంట్‌ లో క‌లిసి ముందుకు సాగడానికి ఒప్పందంపై సంత‌కాలు చేశారు. భూమిని కాపాడుకొనేందుకు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన ఈ యాత్ర..ఉద్యమానికి పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు.

English summary
Sadhguru's 30,000-km motorbike tour , as he set off on his Save Soil awareness campaign across Europe and the Middle East en route to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X