Sadist: అమ్మ, నాన్న, చెల్లెలు, అవ్వ ఎవ్వరినీ వదల్లేదు. అందర్ని చంపేసిన శాడిస్టు, డ్రగ్స్ తో !
న్యూఢిల్లీ: కొడుకు మంచి ఉద్యోగం చేసి ప్రయోజకుడు అయితే చూడాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కొడుకు ఉద్యోగం చేస్తే కూతురికి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. అయితే తల్లిదండ్రులు అనుకున్నదానికి వారి ఇంట్లో అన్ని రివర్స్ గా జరిగాయి. ఉదయం స్నానం చేసి టిప్పుటాపుగా బయటకు వెలుతున్న యువకుడు అతని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసి అర్దరాత్రి ఇంటికి వెలుతున్నాడు. ఇదే ఫ్యామిలీలో దంపతులు, వారి కుమార్తె, ఇంటి పెద్ద తల్లి ఒకేసారి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.

కూతురు, కొడుకు
ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో దినేష్ కుమార్ (44), దర్శన్ సైనీ అలియాస్ సైని (42) దంపతులు నివాసం ఉంటున్నారు. దినేష్ కుమార్, సైనీ దంపతులకు కేశవ్ (25) అనే కుమారుడు, ఊర్వసి (22) అనే కుమార్తె ఉన్నారు. దినేష్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు అతని తల్లిప దీవానోదేవి (75) అనే మహిళ కూడా అదే ఇంటిలో ఉంటున్నారు.

గాలికి తిరుగుతున్న యువకుడు
కొడుకు కేశవ్ మంచి ఉద్యోగం చేసి ప్రయోజకుడు అయితే చూడాలని అతని తల్లిదండ్రులు దినేష్ కుమార్, ఆశా దంపతులు అనుకున్నారు. కొడుకు కేశవ్ మంచి ఉద్యోగం చేస్తే కూతురు ఊర్వసికి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని, ఓ సమస్య తీరుపోతుందని తల్లిదండ్రులు దినేష్ కుమార్, సైనీ ఆశగా ఎదురు చూశారు.

డ్రగ్స్ కు బానిస అయిన కొడుకు
అయితే కేశవ్ డ్రగ్స్ కు బానిస అయ్యాడు. ఉదయం స్నానం చేసి టిప్పుటాపుగా రెడీ అయ్యి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఇప్పించుకుని బయటకు వెలుతున్న కేశవ్ అతని స్నేహితులతో కలిసి డ్రగ్స్, మద్యం సేవించి ఎంజాయ్ చేసి అర్దరాత్రి ఇంటికి వెలుతున్నాడు. కొడుకు కేశవ్ ను అతని తల్లిదండ్రులు మందలించి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం మానేశారు.

అమ్మానాన్న, చెల్లి, అవ్వను ఒకేసారి చంపేసిన శాడిస్టు
రాత్రి డ్రగ్స్ సేవించిన కేశవ్ అతని ఇంటికి వెళ్లాడు. ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు దినేష్ కుమార్, సైనీ, చెల్లెలు ఊర్వసి, అవ్వ దివానో దేవిని దారుణంగా చంపేశాడు. తల్లిదండ్రులు బాత్ రూమ్ లో హత్య చేసిన కేశవ్, అవ్వా, చెల్లిని మరో రూమ్ లో హత్య చేశాడు. ఒకే ఫ్యామిలీలో దంపతులు, వారి కుమార్తె, అవ్వ ఒకేసారి దారుణ హత్యకు గురికావడం ఢిల్లీలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications