Sadist: కాలేజ్ అమ్మాయిని 14 సార్లు పొడిచిన వన్ సైడ్ లవర్, భయంతో రైలు కిందపడి ఆత్మహత్య, గతంలో కిడ్నాప్ !
చెన్నై/తిరుచ్చి: కాలేజ్ లో చదువుకుంటున్న అమ్మాయి వెంటపడిన యువకుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ యువకుడు ఎంతకాలం వెంటపడినా ఆ యువతి మాత్రం అతనికి లొంగలేదు. ప్రతిరోజు ఆమె వెంటపడుతున్న యువకుడు ఆమెకు నరకం చూపించాడు. వెంటపడుతున్న యువకుడి గురించి ఇంట్లో చెబితే తనను కాలేజ్ కు వెళ్లకుండా అడ్డుకుంటారని ఆమె భయపడింది. అమ్మాయి సైలెంట్ గా ఉందని అతను వెంటపడుతూనే ఉన్నాడు. పరీక్ష రాసి ఇంటికి వెలుతున్న యువతిని అడ్డుకున్న వన్ సైడ్ లవర్ నన్ను ప్రేమిస్తావా ? లేదా ? అంటూ బెదిరించాడు. నేను నిన్ను ప్రేమించను అని ఆమె తేల్చి చెప్పింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన శాడిస్టు లవర్ కత్తి తీసుకుని కాలేజ్ అమ్మాయిని 14 సార్లు ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. అమ్మాయిని దారుణంగా పొడిచిన కిరాతకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఇదే అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో ఇతను జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చి ఇంతదారుణానికి పాల్పడ్డాడని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమ్మాయి వెంటపడుతూనే ఉన్నాడు
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని అతికులం ప్రాంతంలో రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. రాజేశ్వరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న రాజేశ్వరి నివాసం ఉంటున్న ప్రాంతం సమీపంలో కేశవన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

ఐలవ్ యూ...... పెళ్లి చేసుకుందాము
జులాయిగా తిరుగుతున్న కేశవన్ కొన్ని సంవత్సరాల క్రితమే రాజేశ్వరి మీద కన్ను వేశాడు. రాజేశ్వరి ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. ఇదే సమయంలో రాజేశ్వరిని లొంగదీసుకోవాలని కేశవన్ అనేక ప్రయత్నాలు చేశాడు. కాలేజ్ లో చదువుకుంటున్న రాజేశ్వరి వెంటపడిన కేశవన్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మూడు సంవత్సరాల నుంచి చెబుతున్నాడు.

భయపడిన కాలేజ్ అమ్మాయి
ఎంతకాలం వెంటపడినా రాజేశ్వరి మాత్రం అతనికి లొంగలేదు. ప్రతిరోజు ఆమె వెంటపడుతున్న కేశవన్ కాలేజ్ అమ్మాయి రాజేశ్వరికి నరకం చూపించాడు. వెంటపడుతున్న కేశవన్ గురించి ఇంట్లో చెబితే తనను కాలేజ్ కు వెళ్లకుండా అడ్డుకుంటారని రాజేశ్వరి భయపడింది. రాజేశ్వరి సైలెంట్ గా ఉందని కేశవన్ ఆమె వెంటపడుతూనే ఉన్నాడు.

కిడ్నాప్ చేసి జైలుపాలైనాడు
రాజేశ్వరి వెంట 2020 నుంచి వెంటపడుతున్న కేశవన్ ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 2021లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేశ్వరిని కేశవన్ అతని స్నేహితుడు కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో నన్ను పెళ్లి చేసుకోవాలని కేశవన్ కాలేజ్ అమ్మాయి రాజేశ్వరి మీద ఒత్తిడి చేశాడు. అయితే రాజేశ్వరి తప్పించుకుని పారిపోయింది. ఇదే కేసులో కేశవన్ ను అరెస్టు చేసిన తిరుచ్చి పోలీసులు అతన్ని జైలుకు పంపించారు. ఇటీవలనే కేశవన్ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు.

కాలేజ్ అమ్మాయిని 14 సార్లు పొడిచి.... ఆత్మహత్య చేసుకున్న శాడిస్టు
పరీక్ష రాసి బంధువుల ఇంటికి వెళ్లిన రాజేశ్వరి తరువాత ఆమె ఇంటికి వెలుతున్న సమయంలో అడ్డుకున్న వన్ సైడ్ లవర్ కేశవన్ నన్ను ప్రేమిస్తావా ? లేదా ? అంటూ ఆమెను బెదిరించాడు. నేను నిన్ను ప్రేమించను అని రాజేశ్వరి తేల్చి చెప్పింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన శాడిస్టు లవర్ కేశవన్ కత్తి తీసుకుని కాలేజ్ అమ్మాయిని 14 సార్లు ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. అమ్మాయిని దారుణంగా పొడిచిన కేశవన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రగాయాలైన రాజేశ్వరి ఐసీయూలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications