Wife: అందమైన భార్య మీద డౌట్, తాగుబోతు భర్త, రాత్రి పంచాయితీ, సెల్ఫీ వీడియో తీసి !

బెంగళూరు/చిత్రదుర్గ: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత అందంగా ఉన్న భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. పీకలదాక మద్యం సేవిస్తున్న భర్త రాత్రి ఇంటికి వెళ్లి అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. దంపతుల మద్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త మద్యం మత్తులో అతని భార్యను చితకబాదేసి వీధిలో పంచాయితీ పెట్టాడు. భర్త తీరుతో విసిగిపోయిన భార్య సెల్ఫీ వీడియో తీసి ఇద్దరు బిడ్డలతో కలసి డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 దంపతులు హ్యాపీ

దంపతులు హ్యాపీ

కర్ణాటకలోకి చిత్రదుర్గా జిల్లాలోని జానకల్ లంబాణిపట్టిలోని మంజు నాయక్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన అర్పితా (27) అనే యువతిని మంజు నాయక్ వివాహం చేసుకున్నాడు. మంజు నాయక్, అర్పితా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

 భార్య మీద డౌట్ వచ్చేసింది

భార్య మీద డౌట్ వచ్చేసింది

మంజు నాయక్, అర్పితా దంపతులకు మానస (6) అనే కూతురు, మదన్ (4) అనే కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన ఆరు సంవత్సరాల తరువాత అందంగా ఉన్న భార్య అర్పితా మీద మంజు నాయక్ కు అనుమానం మొదలైయ్యింది. తన భార్య అర్పితా వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తోందని మంజు నాయక్ విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు.

 పీకలదాక తాగేసి బెండ్ తీస్తున్నాడు

పీకలదాక తాగేసి బెండ్ తీస్తున్నాడు

పీకలదాక మద్యం సేవిస్తున్న మంజు నాయక్ ప్రతిరోజు రాత్రి ఇంటికి వెళ్లి తరువాత అతని భార్య అర్పితాను పట్టుకుని చితకబాదుతున్నాడు. అర్పితా ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో మంజు నాయక్ ఇంకా రగిలిపోయాడు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా మంజు నాయక్ అతని పద్దతి మార్చుకోలేదని సమాచారం.

 రాత్రి పంచాయితీ పెట్టిన తాగుబోతు మొగుడు

రాత్రి పంచాయితీ పెట్టిన తాగుబోతు మొగుడు

అర్పితా, మంజు నాయక్ దంపతుల మద్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన మంజు నాయక్ మద్యం మత్తులో అతని భార్య అర్పితాను చితకబాదేసి పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు. మంజు నాయక్ తీరుతో విసిగిపోయిన అతని భార్య అర్పితా ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

 సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసిన అర్పితా ఆమె ఇద్దరు బిడ్డలు మానస, మదన్ లను చెక్ డ్యామ్ లో తోసేసి తరువాత ఆమె కూడా అందులో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఒకే కుటుంబంలో తల్లీ, పిల్లలో ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. పోలీసులు మంజు నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+