మొఘలులు మనవాళ్లు కాదు, దేశాన్ని దోచారు: ఉప ముఖ్యమంత్రి
భారతదేశ చరిత్రలో మొఘలులకు స్థానం లేదని, వాళ్ళు దేశ సంపదన దోచుకున్నారని యూపీ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ అన్నారు.
లక్నో: భారతదేశ చరిత్రలో మొఘలులకు స్థానం లేదని, వాళ్ళు దేశ సంపదన దోచుకున్నారని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ అన్నారు.
ఓ ప్రయివేటు ఛానల్ అవార్డుల కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా శర్మ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొఘలులు మన పూర్వీకులు కాదని, నిజానికి వాళ్ళు దోపిడీదారులని దినేశ్ శర్మ అన్నారు.

వాళ్ళు దేశాన్ని దోచుకున్నారన్నారు. ఇది మన చరిత్ర కాదన్నారు. యూపీలో అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉంటుందని, అయితే పాకిస్థానీ-తాలిబానీ సంస్కృతిని అంగీకరించేది లేదన్నారు. ఆధునిక చరిత్ర ఆధారంగా రూపొందించిన సిలబస్‌ను పాఠశాలల్లో ప్రవేశపెడతామన్నారు.












Click it and Unblock the Notifications