చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై సిల్క్ భవన్‌లో 400కిలోల బంగారం స్వాధీనం

|
Google Oneindia TeluguNews

చెన్నై: నగరంలోని అగ్నిప్రమాదానికి గురైన చెన్నై సిల్క్ భవన శిథిలాల్లో రెండు భారీ లాకర్లను వెలికితీశారు. ఈ లాకర్లలో 400 కిలోల బంగారు, 2 వేల కిలోల వెండి ఆభరణాలున్నట్లు సమాచారం. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

టీనగర్‌లోని చెన్నై సిల్క్‌ భవనంలో మే 31న భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఆ భవనం మొత్తం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ భవంతిలో 'శ్రీకుమరన్‌ తంగమాళిగై' నగల దుకాణం ఉండగా దీనికి సంబంధించిన భారీ లాకర్లను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు.

Safe retrieved from Chennai Silks building

ఆ భవనం కూల్చివేత పనులు 20 రోజులపాటు సాగగా... మంగళవారం పూర్తిగా నేలమట్టమయింది. ప్రస్తుతం ఆ శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం రెండు లాకర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం వీటిని భద్రపరిచారు.

English summary
A safe was retrieved on Thursday from the fire-ravaged Chennai Silks building, which is yet to be completely razed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X