'ఈ భూమి అల్లాదే': సైదా హమీద్ మాటలపై పెనుదుమారం

యూపీఏ ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసిన సైదా హమీద్, బంగ్లాదేశీ, రోహింగ్యా అక్రమ వలసదారులను భారత్‌లో నివసించడానికి అనుమతించాలని వాదిస్తున్నారు. 'ఈ భూమి అల్లాహ్ ది, బంగ్లాదేశీయులు ఇక్కడ ఎందుకు ఉండకూడదు?' అని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

పహల్గాం దాడి తర్వాత ప్రభుత్వం అక్రమ వలసదారులైన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను గుర్తించి వారి స్వదేశాలకు పంపేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటోందియ అయితే ఈ సమయంలో సైదా హమీద్ వంటి కార్యకర్తలు అక్రమ వలసదారులను భారతదేశంలో ఉండనివ్వాలని ప్రచారం చేస్తుండటం దేశ భద్రతకు ముప్పుగా పరిగణించబడుతోంది. ఆమెతో పాటు ఇదే భావజాలం ఉన్న మరికొంతమంది వ్యక్తులు ఈ ప్రచారాన్ని చేపడుతుండగా.. దీనికి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

Saida Hamid s Controversial Remarks on Illegal Immigrants Ignite Nationwide Debate

'ఈ భూమి అల్లాహ్ ది' అంటూ సైదా హమీద్ వ్యాఖ్యలు
యూపీఏ ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసిన సైదా హమీద్.. అస్సాంలో అక్రమ బంగ్లాదేశీయులపై జరుగుతున్న చర్యలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. 'బంగ్లాదేశీయులు కావడం ఒక నేరమా? వారు కూడా మనుషులే కదా. వారు ఇక్కడ ఉండొచ్చు, ఎవరి హక్కులను లాక్కోవడం లేదు. ఇది చాలా బాధాకరం, భయంకరమైన దుర్మార్గం. మానవత్వానికి ఇది హానికరమైనది. ఈ భూమిని అల్లాహ్ మనుషుల కోసం సృష్టించాడు, రాక్షసుల కోసం కాదు. గ్వాల్పారాలో, జామియాలో జరుగుతున్నది ఒకరకంగా ముస్లింలపై జరుగుతున్న కయామత్ (ప్రళయం)' అని ఆమె అన్నారు.

అస్సాంపై విమర్శలు
సైదా హమీద్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో వ్యతిరేకతతో పాటు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఆమెకు నిరసన సెగ తగిలింది. ఈ కార్యక్రమంలో ఆమె సహచరులైన హర్ష్ మందర్, ప్రశాంత్ భూషణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'అస్సాం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు అది ఒక రాక్షసుడిలా తయారైంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది. ముస్లింల పట్ల ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అస్సాంలో గతంలో 'మియా' (ముస్లిం) అనే పదాన్ని మంచి భావనతో ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు అది ఒక బూతుపదంలా మారింది' అని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ, బీజేపీ నేతల స్పందన
సైదా హమీద్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రాకేష్ సిన్హా మాట్లాడుతూ.. 'ఇంతకంటే దేశ వ్యతిరేక వ్యాఖ్యలు ఉండవు. ఆమెకు బంగ్లాదేశీయులంటే అంత ప్రేమ ఉంటే, ఏడు రోజులు బంగ్లాదేశ్‌లో ఉండి చూడాలి. దేశ ఐక్యతకు భంగం కలిగించే, జనాభా లెక్కలను మార్చే అక్రమ వలసదారులకు మద్దతివ్వడం దేశ వ్యతిరేక శక్తులకు ఏజెంట్లుగా పనిచేస్తున్న పౌరులను సూచిస్తుంది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా.. 'మానవత్వం పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సైదా హమీద్ సన్నిహితురాలు కావచ్చు, కానీ అక్రమ వలసదారులకు మద్దతు ఇవ్వకూడదు' అని రాశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సైతం స్పందిస్తూ.. 'బంగ్లాదేశీయులను అస్సాంలోకి స్వాగతించం. వారితో సానుభూతి ఉన్నవారు వారికి తమ వద్ద చోటివ్వండి. మా రాష్ట్రం, మా గుర్తింపును కాపాడుకోవడానికి మా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతాం' అని అన్నారు.

సైదా హమీద్ ఎవరు?
సైదా హమీద్ యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్లానింగ్ కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా పనిచేశారు. మహిళా హక్కుల కార్యకర్త, విద్యావేత్త, రచయిత్రి అయిన ఆమెకు యూపీఏ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+