అన్నాడీఎంకేలో అసమ్మతి చిచ్చు: దొరైస్వామి, మాజీ స్పీకర్ దెబ్బ
చెన్నై నగర మాజీ మేయర్ సైదై దొరైస్వామి, తమిళనాడు మాజీ స్పీకర్, ప్రముఖ న్యాయవాది పాండియన్ కూడా శశికళకు దూరంగా ఉంటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జయలలిత కేసులు అన్నీ పాండియన్ వాదించారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో రోజురోజుకు అసంతృప్తితో రగిలిపోతున్న నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. అసమ్మతి చిచ్చు రేగడంతో ఆ నాయకులు అంతా కలిసి శశికళ వ్యతిరేకులను ఎకం చెయ్యడానికి సిద్దం అయ్యారు.
చెన్నై నగర మాజీ మేయర్ సైదై దొరైస్వామి, తమిళనాడు మాజీ స్పీకర్, ప్రముఖ న్యాయవాది పాండియన్ కూడా శశికళకు దూరంగా ఉంటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీలో ప్రముఖులైన వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తో చెన్నై మాజీ మేయర్ సైదై దొరైస్వామి, పాండియన్ రహస్యంగా మంతనాలు జరిపారని వెలుగు చూసింది. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, సెంగట్టయ్యన్, పొన్నయన్, మాజీ మేయర్ సైదై దొరైస్వామి పోయయెస్ గార్డెన్ చేరుకుని శశికళను కలిశారు.

ఆ సమయంలో పార్టీ నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. చిన్నమ్మ శశికళ పార్టీ పగ్గాలు చేపట్టాలని ముగ్గురు నాయకులు చెప్పారు. అయితే చెన్నై నగర మాజీ మేయర్ సైదై దొరైస్వామి మాత్రం చిన్నమ్మ అని కాకుండా వీకే. శశికళ పార్టీ చీఫ్ గా పగ్టాలు చేపట్టాలని మీడియాకు చెప్పారు.
చిన్నమ్మను పేరుపెట్టి పిలుస్తావా అంటు శశికళ కుటుంబ సభ్యులు, ఆమె అనుచరులు సైదై దొరైస్వామికి వార్నింగ్ ఇచ్చారు. ఇక మీద నువ్వు పోయెస్ గార్డెన్ వైపు కన్నెత్తి చూడకూడదని శశికళ పార్టీ అధికార ప్రతినిధి పొన్నయన్ చేత చెప్పించారని సమాచారం.
ఆ రోజు నుంచి సైదై దొరైస్వామి పోయెస్ గార్డెన్ ఛాయలకుకూడా వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యారు. డిసెంబర్ 29వ తేది జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి కూడా సైదై దొరైస్వామిని దూరం పెట్టారు.
జయలలిత అన్ని కేసులు ఇప్పటి వరకు వాదించిన సీనియర్ న్యాయవాది, తమిళనాడు మాజీ స్పీకర్ పాండియన్ సైతం శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం గుర్తించిన శశికళ అనుచరలు వీరిద్దరి మీద నిఘా వేశారు.
సైదై దొరైస్వామి, పాండియన్, ఆయన కుమారుడు మనోజ్ పాండియన్ అన్నాడీఎంకే పార్టీలోని అసమ్మతి నేతలను ఏకం చెయ్యడానికి సిద్దం అయ్యారు. మనోజ్ పాండియన్ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మెరినా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు.
అన్నాడీఎంకే సీనియర్లు అయిన పాండియన్, సైదై దొరైస్వామి ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే శశికళ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు ఇప్పుడు వేల సంఖ్యలో జయలలిత మేనకోడలు దీపాను కలలిసి మద్దతు ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే అన్నాడీఎంకేలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న చెన్నై నగర మాజీ మేయర్ సైదై దొరైస్వామి దీపాతో రహస్యంగా మంతనాలు జరిపారని సమాచారం. జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్ కే నగర నియోజక వర్గంలో మాజీ మేయర్ సైదై దొరైస్వామి సంచరించారు.
ఆర్ కే నగర్ నుంచి దీపాను పోటీ చేయించాలని సైదై దురైస్వామి తన వర్గీయులు, ఆర్ కే నగర ప్రజలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇదే జరిగితే ఆర్ కే నగర్ నుంచి దీపా కచ్చితంగా గెలుస్తారని అసమ్మతి నేతలు అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications