సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక మహిళ అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న మహమ్మద్ షరిఫుల్ ఇస్లామ్ షహజాద్ కు సహకరించిన మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ పై దాడిలో ఈ మహిళ కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ మహిళను పోలీసులు పశ్చిమ బెంగాల్ లో అరెస్ట్ చేశారు. నిందితుడు షహజాద్ వినియోగించిన సెల్ ఫోన్ లోని సిమ్ కార్డు ఈ మహిళ పేరుమీదనే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగాల్ లోని నదియా జిల్లాలోని చప్రాలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ముంబయికు తరలించి దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు షహజాద్ వేలిముద్రలు.. ఘటనాస్థలిలో దొరికిన వేలిముద్రలు వేరుగా ఉన్నాయన్న కథనాలు వచ్చాయి. దీంతో ఘటనా ప్రదేశానికి వెళ్లి మరిన్ని నమూనాలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసును ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.

Saif Ali Khan s Legal Saga Bengal Woman Arrested in Connection with Investigation

జనవరి 16 తెల్లవారుజామున ముంబయి బాద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన షహజాద్.. సైఫ్ ను ఆరుసార్లు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడినుండి పరారయ్యాడు. సైఫ్ అలీఖాన్ ను కుటుంబసభ్యులు స్థానిక లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ సైఫ్ కు వెన్నెముక సర్జరీ చేశారు వైద్యులు. జనవరి 21న ఆయన ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బాద్రా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+