అంబానీ డ్రైవర్ జీతమెంతో తెలుసా?: నెట్టింట్లో హాట్ టాపిక్ ఇదే!
ఇప్పుడు ఇంటర్నెట్‍తోపాటు సోషల్ మీడియాలో ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. భారత కుబేరుడు ముకేష్ అంబానీ కారు డ్రైవర్ జీతమెంత? అనేదే ఈ విషయం కావడం గమనార్హం.
ముంబై: ఇప్పుడు ఇంటర్నెట్‍తోపాటు సోషల్ మీడియాలో ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. భారత కుబేరుడు ముకేష్ అంబానీ కారు డ్రైవర్ జీతమెంత? అనేదే ఈ విషయం కావడం గమనార్హం. ఎందుకంటే సాధారణ డ్రైవర్ల జీతాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
కానీ, అంబానీ కారు డ్రైవర్ అంటే వేరే విషయమే కాదా! అయితే, అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలిసిన వారు మాత్రం ఒక్కసారిగా షాకవుతుండటం గమనార్హం. ఎందుకంటే.. ముకేష్ అంబానీ తన డ్రైవర్లకు ప్రతి నెలా దాదాపు ఒక్కొక్కరికి రూ.2లక్షలు జీతంగా ఇస్తున్నారట.

అయితే, అంబానీకి డ్రైవర్‌గా ఎంపిక కావడం అంత సులభమేం కాదు. ఎందుకంటే ఇందుకు తగిన విధంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగిన అర్హతలు కూడా ఉండాలి. ఆ ప్రక్రియను గమనించినట్లయితే.. ముందుగా అంబానీ మేనేజర్ ఓ ప్రైవేటు డ్రైవింగ్ ఏజెన్సీని సంప్రదిస్తారు.
కొందరు డ్రైవర్లను ఎంపిక చేసి వారికి కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షల్లో విజయవంతమైనా సుదీర్ఘ శిక్షణ ఇచ్చిన తర్వాతే డ్రైవర్‌గా నియమిస్తారు. అంతేగాక, ఆ డ్రైవర్ అదృష్టం బాగుంటే జీతంతోపాటు భోజనం, నివాసం సదుపాయాలు కూడా సమకూరుతాయి.












Click it and Unblock the Notifications